జాతీయ వార్తలు

‘యోగా’కు సర్వసన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 5: మరికొద్ది రోజుల్లో జరుగనున్న రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు దేశంలోని ప్రముఖ యోగా సంస్థలు తమ వంతు తోడ్పాటును అందజేస్తున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన శిక్షకులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్న విషయం విదితమే. ఈ వేడుకల సందర్భంగా యోగ విద్య పట్ల ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు విస్తృత శిక్షణా కార్యక్రమాలను, యోగా ప్రదర్శనలను, యోగ విద్యలో నిష్ణాతులైన వారితో చర్చాగోష్ఠులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం యోగా శిక్షకులకు శిక్షణతోపాటు సలహాలను అందజేయడం ద్వారా ప్రభుత్వానికి తోడ్పాటును అందించేందుకు దేశంలోని ప్రతిష్టాత్మకమైన పలు యోగా సంస్థలు అంగీకరించాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు లేఖలు జారీ చేసింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిందిగా అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, అనుబంధ విభాగాల్లోని ఉన్నతాధికారులందరితో పాటు కింది స్థాయి అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆ లేఖల్లో కార్యదర్శులకు స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే పలు విభాగాలు తమ తమ కార్యాచరణ ప్రణాళికలను ‘ఆయుష్’ (ఆయుర్వేద, యోగా, న్యూరోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి) మంత్రిత్వ శాఖకు పంపాయని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. యోగా దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనాలా లేదా అన్నది ఐచ్ఛికమేనని, అయితే ఈ వేడుకల్లో పాల్గొనదలచిన ఉద్యోగులు కామన్ యోగా ప్రొటోకాల్స్‌ను పాటించాల్సిందిగా సూచించామని ఆయన వివరించారు.