జాతీయ వార్తలు

దిలీప్ కుమార్‌కు పద్మవిభూషణ్ ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 13: విషాద చిత్రాలకు పెట్టింది పేరైన అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ (93) పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నాడు. దీర్ఘకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న దిలీప్ కుమార్‌కు ముంబయి శివారు బాంద్రాలోని ఆయన నివాసంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఈ అవార్డును ప్రదానం చేశారు. దిలీప్ కుమార్ ఆరు దశాబ్దాలకు పైగా హిందీ చిత్రసీమకు అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనను ఈ అవార్డుతో గౌరవించింది. ‘నయా దౌర్’, ‘జుగ్ను’, ‘అందాజ్’, ‘దేవదాస్’ వంటి ఎన్నో మేటి చిత్రాలతో విశిష్టమైన గుర్తింపు తెచ్చుకున్న దిలీప్ కుమార్‌కు ఆయన సతీమణి సైరాబాను (71) సమక్షంలో ఈ అవార్డు కింద పతకాన్ని, ప్రశంసాపత్రాన్ని, దుశ్శాలువను బహూకరించారు. వృద్ధాప్యం, ఇతర అనారోగ్య సమస్యలతో చాలాకాలం నుంచి బాధపడుతున్న దిలీప్ కుమార్‌కు ఈ అవార్డును ప్రదానం చేస్తున్నప్పడు ఆయన సైరాబాను సహాయంతో అతి కష్టం మీద కళ్లు తెరిచారు. దిలీప్ కుమార్‌కు పద్మవిభూషణ్ అవార్డును ప్రదానం చేసేందుకు రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు ఆయన నివాసానికి వెళ్లారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26వ తేదీన దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్ తదితర బాలీవడ్ సీనియర్ నటులకు ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించిన విషయం విదితమే.
అయితే అనారోగ్యం కారణంగా దిలీప్ కుమార్ రాష్టప్రతి భవన్‌లో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోలేకపోవడంతో ప్రస్తుతం రాజ్‌నాథ్ చేతుల మీదుగా దీనిని ప్రదానం చేశారు.

దిలీప్ కుమార్ ఇంటిక వెళ్లి పద్మ విభూషణ్ అవార్డును ప్రదానం చేస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు తదితరులు