జాతీయ వార్తలు

కేరళలో సోనియాపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జూన్ 8: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై కేరళకు చెందిన ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కోర్టులో కేసు దాఖలు చేసింది. నెయ్యర్‌లో రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ కాంప్లెక్స్ సంస్థకు సంబంధించి భవన నిర్మాణాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేపట్టింది. భవన నిర్మాణ బాధ్యతలను హీథర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించారు. పను లు పూర్తిచేసినా నిర్మాణ సంస్థకు బిల్లులు చెల్లించలేదు. దీంతో కంపెనీ మేనేజింగ్ పార్టనర్ విజయ్ తరఫున న్యాయవాది బాబూరాజ్ ఫిర్యాదు చేశారు. ఇందులో సోనియాగాంధీని ప్రధాన ప్రతివాదిగా పేర్కొన్నారు. భవన నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న 2.8 కోట్ల రూపాయలు ఇప్పించాలని కోరారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ విఎన్ సుధీరన్, మాజీ సిఎం ఉమెన్ చాందీ, పిసిసి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల, ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ హిదూర్ మహ్మద్‌లపై కేసు పెట్టారు. కెపిసిసి ఆధ్వర్యంలో భవన నిర్మాణం పూర్తిచేయగా 2013లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రారంభోత్సవం చేశారు. కేసు విషయంపై రమేష్ చెన్నితల మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు త్వరలోనే చెల్లించి పరిష్కరించుకుంటామని చెప్పారు. బిల్లులకు సంబంధించి కొంత అయోమయం ఉందని ఏది ఏమైనా దాన్ని పరిష్కరించుకుంటామన్నారు. సోనియాగాంధీపై కేసుపెట్టడం చౌకబారు ఎత్తుగడ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాల విమర్శించారు.