జాతీయ వార్తలు

మేధో కవాటాలు మూయకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 8: మేధో కవాటాలు ఎప్పటికీ తెరిచి ఉన్నప్పుడే స్వేచ్ఛగా సృజనాత్మక ఆలోచనల ప్రసారాలు ఒకరి నుంచి ఒకరికి కొనసాగుతాయని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం అన్నారు. ఆలోచనల పరస్పర ప్రసారం వల్ల నూతన ఆవిష్కరణలకు దారి ఏర్పడుతుందని ఆయన అన్నారు. తాను రాష్టప్రతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చేసిన కార్యకలాపాలన్నింటినీ క్రోడీకరించి ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ప్రచురించిన ‘ది ఎడ్యుకేషన్ ప్రసిడెంట్’ పుస్తకం తొలి ప్రతిని ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ చేతుల మీదుగా రాష్టప్రతి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్నతవిద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలు సాధించేందుకు సృజనాత్మకత, పరిశోధనలపై మరింత దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని, విద్యావేత్తలకు, ఉపాధ్యాయులకు తగిన గుర్తింపును కూడా అందించాల్సి ఉందని ప్రణబ్ అన్నారు. ఉన్నత విద్యలో ఈ రకమైన ప్రమాణాలను సాధించేందుకు వివిధ సంబంధిత విభాగాలు సమృద్ధిగా నిధులను విడుదల చేయాలని ఆయన సూచించారు. ‘వివిధ ప్రాంతాల నుంచి రకరకాల ఆలోచనలు నిరంతరాయంగా రావాలి. అందుకు తగిన వాతావరణాన్ని మన కల్పించాలి. బయటి నుంచి వచ్చిన ఆలోచనలకు మనవి తోడై సరికొత్త ఆవిష్కరణ జరగాలి. మన మేధో కవాటాలు ఎప్పటికీ మూయరాదు. మనల్ని మనం ఎప్పటికప్పుడు ఉన్నత స్థితికి చేర్చుకోవాలి’ అని రాష్టప్రతి పిలుపునిచ్చారు. రాష్టప్రతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తాను వివిధ సంస్థలను సందర్శించిన సందర్భంలో అనేక విషయాలను తెలుసుకున్నానని ఆయన అన్నారు.
chitram..
ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ చేతుల మీదుగా ‘ది ఎడ్యుకేషన్ ప్రసిడెంట్’ పుస్తకం
తొలి ప్రతిని అందుకుంటున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ