జాతీయ వార్తలు

కాబూల్‌లో భారతీయ మహిళ కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/కోల్‌కతా, జూన్ 10: అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న భారతీయ మహిళను కాబూల్‌లో అనుమానిత ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కోల్‌కతాకు చెందిన జుదిత్ డిసౌజా కాబూల్‌లో ఆగాఖాన్ ఫౌండేషన్ సంస్థలో సీనియర్ సాంకేతిక సలహాదారుగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం ఆఫీసు బయట జుదిత్‌తో పాటు సెక్యూరిటీ గార్డు, డ్రైవర్‌ను కిడ్నాప్ చేశారు. కాబూల్ నడిబొడ్డున తైమని ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరో వారం రోజుల్లో భారత్‌కు తిరిగిరావాల్సిన జుదిత్ కిడ్నాప్‌కు గురికావడంతో కోల్‌కతాలోని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా, జుదిత్‌ను ఉగ్రవాదుల చెరనుంచి విడిపించేందుకు ప్రభుత్వం తరపున అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. జుదిత్‌ను వీలైనంత త్వరలో విడిపించేందుకు అక్కడి దౌత్యకార్యాలయం అన్ని చర్యలు తీసుకుంటోందని, అఫ్గానిస్తాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆమె తెలిపారు. అలాగే కోల్‌కతాలోని జుదిత్ కుటుంబ సభ్యులకు ప్రభు త్వం తరపున భరోసా ఇచ్చినట్లు సుష్మ పేర్కొన్నారు. జుదిత్‌తో పాటు మరో ఇద్దరు కిడ్నాప్‌కు గురయ్యారని మా కు సమాచారం వచ్చిందని కోల్‌కతాలో నివసిస్తున్న ఆమె తండ్రి డి డిసౌజా వెల్లడించారు. జుదిత్‌ను వీలైనంత త్వరగా విడిపించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జుదిత్‌ను క్షేమంగా విడిపించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత్‌లోని ఆగాఖాన్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రతీష్ నందా వెల్లడించారు.