జాతీయ వార్తలు

భారత్, జపాన్, అమెరికా నావికా విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 10: దక్షిణాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో సైనిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, సహకారాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి కేంద్రీకరించిన భారత్, జపాన్, అమెరికా శుక్రవారం దక్షిణ చైనా సముద్ర సమీపంలో సంయుక్తంగా నావికాదళ విన్యాసాలను ప్రారంభించాయి. మన దేశం అవలంబిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ విధానానికి అనుగుణంగా జరుగుతున్న ఈ 20వ ఎడిషన్ విన్యాసాల్లో సాత్పుర, సహ్యాద్రి, శక్తి, కిర్చి యుద్ధనౌకలు పాల్గొంటున్నాయని, ఈ విన్యాసాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నౌకాయాన భద్రతకు తోడ్పాటును అందించడంతో పాటు అంతర్జాతీయ నావికా వ్యవస్థకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని భారత నావికాదళం పేర్కొంది. ఈ ప్రాంతంలో చైనా తరచుగా దుందుడుకు చర్యలకు దిగుతూ ఇరుగు పొరుగు దేశాలను కవ్విస్తున్న నేపథ్యంలో భారత్, జపాన్, అమెరికా సంయుక్తంగా ఈ విన్యాసాలను ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 1992 నుంచి సంయుక్తంగా నావికాదళ విన్యాసాలను నిర్వహిస్తున్న భారత్, అమెరికా గత ఏడాది చెన్నైలో ఈ విన్యాసాలను నిర్వహించిన విషయం విదితమే. ఈ ఏడాది విన్యాసాల్లో భారత్, అమెరికాతో పాటు జపాన్ నావికాదళం కూడా పాల్గొంటోంది. సాసెబోలో సోమవారం హార్బర్ ఫేజ్ విన్యాసాలు ప్రారంభమవగా, ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు పసిఫిక్ మహాసముద్రంలో సీ ఫేజ్ విన్యాసాలు జరుగుతాయి.