జాతీయ వార్తలు

మీ త్యాగాన్ని మరువలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసి పధ్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర పార్లమెంటు సభ్యులు ఆ దాడిలో మృతిచెందిన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. మృతులకు నివాళులర్పించిన వారిలో ప్రధాని మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మాహెప్తుల్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ తదితరులున్నారు. పార్లమెంటు భవనం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి హాజరయిన వారిలో కాంగ్రెస్ నాయకులు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, బిజెపి ఎంపి సత్యనారాయణ్ జతియా తదితరులు కూడా ఉన్నారు. కార్యక్రమానికి హాజరయిన అమరవీరుల కుటుంబ సభ్యులను కూడా ప్రధాని మోదీ కలిశారు.
మృతుల సంస్మరణార్థం పార్లమెంటు సభ్యులు రెండు నిమిషాలు వౌనం పాటించారు. 2001 డిసెంబర్ 13న అయిదుగురు సాయుధ మిలిటెంట్లు పార్లమెంటులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో తొమ్మిది మంది చనిపోవడం తెలిసిందే. మృతుల్లో ఢిల్లీ పోలీసుకు చెందిన అయిదుగురు, సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఓ మహిళా అధికారి, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి ఉన్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటును రక్షించడంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను మనం గుర్తు చేసుకుంటున్నాం అని ప్రధాని మోదీ ఆ తర్వాత ట్విట్టర్‌లో అన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇదే విధమైన మనోభావాలను వ్యక్తం చేసారు. ఉగ్రవాద దాడిని తిప్పికొట్టడంలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లు, ఇతర మృతులకు శాల్యూట్ చేస్తున్నాను అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

చిత్రం.. పార్లమెంటుపై జరిగిన దాడిలో మృతిచెందిన వారికి నివాళులు అర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులు