అంతర్జాతీయం

రాష్టప్రతి పర్యటన తర్వాత అఫ్రికా దేశాలకు మోదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్రా, జూన్ 14: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అఫ్రికాకు చెందిన ఘనా, ఐవరీ కోస్ట్, నమీబియా దేశాల్లో తొలిసారిగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటన ముగిసిన కొద్దిరోజులకే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలను సందర్శించనున్నారు. ఘనాలో భారత రాయబారి కె జీవసాగర్ సోమవారం తన గౌరవార్థం ఇచ్చిన విందు సందర్భంగా అక్కడి భారతీయ సంతతివారినుద్దేశించి మాట్లాడుతూ రాష్టప్రతి స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు. భారతీయులు, మూడు అఫ్రికా దేశాల్లో తాను జరుపుతున్న పర్యటన యాదృచ్ఛికం కాదని, గత ఏడాది న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఆఫ్రికా ఫోరమ్ సదస్సు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చర్య ఇదని ఆయన అన్నారు. ‘కొద్ది రోజుల క్రితమే ఉపరాష్టప్రతి హమిద్ అన్సారీ టునీసియా, మొరాకో దేశాల్లో పర్యటించారు. నేను ఇప్పుడు మూడు దేశాల్లో పర్యటిస్తున్నాను. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ మరో నాలుగైదు ఆఫ్రికా దేశాల్లో పర్యటించనున్నారు అని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్వచ్ఛ్భారత్ మిషన్, స్మార్ట్ నగరాలు లాంటి పథకాల్లో పాలు పంచుకోవాలని ఆయన ఘనాలోని భారతీయ సంతతివారిని కోరారు. ఆఫ్రికా దేశాలతో భారత దేశ వాణిజ్యం ఇప్పుడు 7000 కోట్ల డాలర్లను దాటిపోయిందని, పెట్టుబడులు 3500 కోట్ల డాలర్లకు చేరుకున్నాయని తెలిపారు. గత కొద్ది సంవత్సరాల్లో భారతదేశం ఘనాకు వివిధ ప్రాజెక్టులకోసం 40 కోట్ల డాలర్లకు పైగా రాయితీలతో కూడిన రుణాన్ని అందించిందని ఆయన చెప్పారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం మూడు వందల కోట్ల డాలర్లకు చేరుకుందని చెప్పారు. 2020 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 కోట్ల డాలర్లకు తీసుకెళ్లడానికి ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామాతో తన చర్చల సందర్భంగా ఇరుపక్షాలు అంగీకరించినట్లు ప్రణబ్ ముఖర్జీ చెప్పారు.