జాతీయ వార్తలు

రాహుల్ చురుకైన నాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అత్యంత చురుకైన నాయకుడని, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అని ఆ పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ అన్నారు. భారతీయ విలువల పట్ల రాహుల్ నిబద్ధత ప్రధాని నరేంద్ర మోదీకన్నా ఎంతో మెరుగని, వాస్తవాలను వక్రీకరించడంలో మోదీకి గొప్ప నేర్పు ఉందని మంగళవారం ఓ న్యూస్ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం త్వరలోనే జరుగుతుందన్న ఆశాభావాన్ని సైతం ఆయన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజనపై జైరామ్ రమేశ్ రాసిన పుస్తకం ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. ‘ప్రజాస్వామ్య బద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం, పని చేయడానికి జనాన్ని అనుమతించడం, వివిధ వర్గాలకు చెందిన వారు తమ అభిప్రాయాలు వెల్లడించడానికి అనుమతించడం.. ఇవన్నీ చూస్తే ఆయన అందరికీ అందుబాటులో వ్యక్తి అని అర్థమవుతుంది. సంస్థాగతమైన ప్రక్రియల్లో ఆయనకు నమ్మకముంది’ అని జైరామ్ రమేశ్ అన్నారు. నిర్ణయాల తీసుకోవడంలో రాహుల్‌కు తనదైన పద్ధతి ఉందని, భారతీయ సెక్యులర్ విలువలకు ఆయన ఎంతో కట్టుబడి ఉన్నారు. ఆయన మాటలకు, ఆయన నమ్మినదానికి, ఆయన చేతలకు పెద్దగా తేడా ఉంటుందని తాను అనుకోవడం లేదని కూడా జైరామ్ రమేశ్ అన్నారు. ఇతర పార్టీలతో కాంగ్రెస్ పోత్తు పెట్టుకోవడం గురించి అడగ్గా, పొత్తులు అవసరమేనని, అయితే గుడ్డిగా కాంగ్రెస్‌ను వ్యతిరేకించడం ఉండరాదని, బిజెపిని గుడ్డిగా వ్యతిరేకించడం కూడా పరిష్కారం కాదని, ఎవరినో ఓడించడం కోసం కాక కొన్ని ఐక్యతా కార్యక్రమాలు, ఆలోచనల ఆధారంగా శక్తులు ఒకటి కావాలన్నారు.

ఉద్యమంలా యోగా
మంత్రులకు ప్రధాని పిలుపు
న్యూఢిల్లీ, జూన్ 14: త్వరలో జరుగనున్న రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులకు, వివిధ మంత్రిత్వ శాఖల అధిపతులకు పిలుపునిచ్చారు. భౌతికంగా, మానసికంగా ఆరోగ్యకరమైన ప్రక్రియగా యోగాను ప్రజలందరూ పాటించేలా ఒక ఉద్యమాన్ని నిర్మించాలని ఆయన తన మంత్రులందరికీ రాసిన ఓ లేఖలో వివరించారు. జూన్ 21 యోగా దినోత్సవం జరుగుతున్న సంగతి తెలిసిందే ‘యోగా దినోత్సవం కేవలం ఒక కార్యక్రమం కారాదు. ఇది మన జీవితాల్లో అంతర్గతంగా విడదీయరాని బంధం. దీన్ని ప్రజల్లోకి, సమూహాల్లోకి తీసుకుపోవటం, వివిధ వయస్సుల వారికి అందుబాటులోకి తీసుకురావటం వల్ల శారీరక, మానసికంగా ఆరోగ్యం బలపడుతుంది. ఇందుకు మీ అందరి సహకారాన్ని ఆశిస్తున్నాను’ అని మోదీ లేఖలో రాశారు. యోగా దినోత్సవం ఈసారి చండీగఢ్‌లో జరగనుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో, ప్రపంచంలోని వివిధ దేశాల్లో యోగా కార్యక్రమాలు చేపట్టనున్నారు.

యోగావల్ల కలిగే లాభాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మోదీ తెలిపారు. యోగా దినోత్సవంపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన కార్యక్రమ వివరాలను కూడా మోదీ కేంద్ర మంత్రులకు పంపించారు.