జాతీయ వార్తలు

గంట యానానికి రూ.2500

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: పౌర విమాన యాన రంగాన్ని అభివృద్ధికి ఊతాన్నిచ్చే కొత్త ఏవియేషన్ విధానాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. అలాగే నిపుణుల సేవల్ని మరికొంత కాలం ఉపయోగించుకునే లక్ష్యంతో సిజిహెచ్ వైద్యుల పదవీ కాలాన్ని 62నుంచి 65 సంవత్సరాలకు పెంచడంతో పాటు పలు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కొత్త ఏవియేషన్ విధానంలో విమాన చార్జీలను సహేతుకంగా తీర్చిదిద్దింది.గంట ప్రయాణానికి రూ.2,500గా చార్జీని నిర్ణయించింది. కొత్త మార్గాల్లో విమాన సర్వీసులను అందించే సంస్థలకు పలు రాయితీలను ప్రకటించింది.
అయితే స్థానిక సంధానత నిధి కింద ప్రయాణికులపై అదనపు లెవీనీ విధించింది. అలాగే అత్యంత వివాదాస్పదంగా మారిన 5/20 నిబంధనను కేబినెట్ రద్దు చేసింది. ఇక నుంచి 20 విమానాలు లేదా తమ మొత్తం సామర్థ్యంలో 20శాతాన్ని దేశీయ సర్వీసులకు కేటాయించే ఏ పౌర విమానయాన సంస్థకైనా విదేశీ సర్వీసులు నడిపే అవకాశం కలుగుతుంది. కొత్త విధానంలో భాగంగా కొత్త విమానాశ్రయాలను నిర్మించడంతో పాటు హెలికాప్టర్ల కోసం కొత్త నిబంధనలనూ అమలులోకి తీసుకొస్తారు. ప్రాంతీయంగా అన్ని ప్రాంతాలకూ విమాన సౌకర్యాలను విస్తరించాలన్న నిర్ణయాన్ని సెప్టెంబర్ లోగా అమలుచేసే అవకాశం ఉంది. అన్ని వర్గాల ప్రజలకు విమానయానాన్ని అందుబాటులోకి తేవడమే ఈ కొత్త విధాన లక్ష్యమని పౌర విమానయాన కార్యదర్శి ఆర్ ఎన్ చౌబే తెలిపారు. స్థానిక కనెక్టివిటీ నిధి కింద ప్రయాణికులపై విధించే లెవీ మొత్తం అతి స్వల్పంగానే ఉంటుందని అన్నారు. ఐదు సంవత్సరాల అనుభవం 20 విమానాలు కలిగిన సంస్థలు మాత్రమే విదేశీ సర్వీసులు నిర్వహించాలన్న నిబంధనను యూపీఏ తీసుకొచ్చిందని, అందుకే దాన్ని రద్దు చేశామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

చిత్రం.. మంత్రివర్గ నిర్ణయాలు మీడియాకు వెల్లడిస్తున్న అశోక్ గజపతి రాజు, రవిశంకర్ ప్రసాద్