జాతీయ వార్తలు

దేశంలో పోలియో లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూన్ 15: తెలంగాణ రాజధాని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పోలియో వైరస్ కనిపించిందంటూ వచ్చిన వార్తలను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జె పి నడ్డా ఖండించారు. ఇది కేవలం వ్యాక్సీన్ డిరైవ్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ మాత్రమేనని ఆయన చెప్పారు. వ్యాక్సీన్ డిరైవ్డ్ పోలియో వైరస్ నమోదు అయినంత మాత్రాన భారత దేశం పోలియో విముక్తమైందనే పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదని నడ్డా ప్రకటించారు. భారత దేశం ఈరోజుకు కూడా పోలియో రహిత దేశమేనని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. పోలియో వైరస్ కనిపించినట్లు చెబుతున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రత్యేక టీకాల కార్యక్రమం చేపడతామని ఆయన ప్రకటించారు. పోలియో వైరస్‌ను దేశం నుండి నిర్మూలించటం జరిగిందంటూ, ఆఖరు పోలియో కేసు 2011 జనవరి 13 తేదీనాడు నమోదయిందని ఆయన తెలిపారు. గత ఐదు సంవత్సరాల నుండి ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదన్నారు. గత ఐదు సంవత్సరాల నుండి మొదటి సారి పోలియో వైరస్ (పి.2) వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్న వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మురుగు కాలువ నుండి సేకరించిన శాంపిల్‌లో కనిపించింది పోలియో వైరస్ కాదని, అది కేవలం వ్యాక్సీన్ డిరైవ్డ్ పోలియోవైరస్ (విడిపివి) స్ట్రెయిన్ మాత్రమేనని నడ్డా స్పష్టం చేశారు. అయినా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలోని పిల్లలెవ్వరికి వ్యాక్సీన్ డిరైవ్డ్ పోలియో వైరస్ సోకినట్లు కనిపించలేదని నడ్డా ప్రకటించారు. దేశంలో వైల్డ్ పోలియో 2 రకం వైరస్ సోకిన కేసు దాదాపు 17 సంవత్సరాల క్రితం 1999లో నమోదు అయ్యిందంటూ ఇప్పుడు వ్యాక్సీన్ డిరైవ్డ్ పోలియో వైరస్ కనిపించినంత మాత్రాన పోలియో విముక్త దేశం అనే పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదని ఆయన వాదించారు. దేశంలో నిఘా వ్యవస్థ ఎంతో పటిష్ఠంగా ఉన్నది కాబట్టే వ్యాక్సీన్ డిరైవ్డ్ పోలియో వైరస్ ఉన్నట్లు కనుగొనగలిగారని ఆయన వివరించారు. పోలియో డిరైవ్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ అత్యంత అరుదైంది, ఇది ఓరల్ పోలియో వ్యాక్సీన్ (ఓపివి)ద్వారా వచ్చిందని మంత్రి చెప్పారు. పోలియో వైరస్‌ను కనుగొన్న ప్రాంతాల్లో ప్రజల్లో పోలియో వైరస్ 2 పట్ల వైరస్ నిరోధక శక్తి అత్యంత అధికంగా ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ జరిపిన ప్రత్యేక ఆకస్మిక పరీక్షల్లో తేలిందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో ఈ ఏడాది ఏప్రిల్ 24 తేదీ వరకు ఓరల్ పోలియో వ్యాక్సీన్ పంపిణీ జరిగిందని మంత్రి తమ ప్రకటనలో తెలిపారు. 2016 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇక్కడ పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో జరిపిన శాంపిల్ సర్వేల ప్రకారం 94 శాతం పిల్లలకు మూడు డోసుల ఓపివి ఇచ్చారన్నారు. ఈ కారణం చేత పోలియో వైరస్ ఇతర ప్రజలకు సోకే అవకాశాలు అత్యంత తక్కువగా ఉన్నాయని నడ్డా తెలిపారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా పోలియో నివారణకు ప్రత్యేక రోగ నిరోధక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నడ్డా ప్రకటించారు. ఈ నెల 20నుండి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో చేపడతారని ఆయన తెలిపారు.