జాతీయ వార్తలు

భారతీయుడినని నిరూపించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: పరిపాలనలో పారదర్శకతను తీసుకు వచ్చేందుకు యుపిఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం దేశంలోని ఏ వ్యక్తి కోరినా ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి తీరాల్సి ఉంటుంది. రక్షణ వ్యవహారాలులాంటి కొన్ని కీలకమైన అంశాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. అయితే పలు కీలక అంశాలకు సంబంధించిన సమాచారాన్ని నిరాకరించడానికి ప్రభుత్వ అధికారులు రకరకాల సాకులు వెతుకుతున్నారు.
తాజాగా గుజరాత్‌లో కలకలం సృష్టించిన ఇషత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించకుండా ఉండడానికి హోం శాఖ ఒక కొత్త అస్త్రాన్ని వెతుక్కుంది. ఇషత్ జహాన్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫైళ్లు కనిపించకుండా పోవడంపై దర్యాప్తు కోసం ప్రభుత్వం హోం శాఖలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి బికె ప్రసాద్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించడం తెలిసిందే. ఈ కమిషన్ గడువు ముగిసిపోతుండడంతో ఇటీవలే రెండు నెలలు పొడిగించారు కూడా. ఈ కమిషన్ బుధవారం తన నివేదిను సమర్పించింది. ఈ నివేదిక పత్రాలు, అలాగే ప్రసాద్ సర్వీసు పొడిగింపునకు సంబంధించిన ఫైల్ నోటింగ్స్‌ను ఇవ్వాలంటూ అజయ్ దూబే అనే ఆర్‌టిఐ కార్యకర్త ఈ చట్టం కింద హోం శాఖకు దరఖాస్తు దాఖలు చేశారు. అయితే దూబే అడిగిన సమాచారం ఇవ్వడానికి బదులు హోం శాఖ ‘మీరు భారతీయుడేనని రుజువు చేసే సాక్ష్యాధారాలను సమర్పించండి’ అంటూ ఆయనకు ప్రతిసమాధానం ఇచ్చింది. సమాచార హక్కు చట్టం కింద భారతీయ పౌరులు మాత్రమే సమాచారాన్ని కోరాలి. సాధారణంగా అయితే ఈ చట్టం కింద సమాచారం కోసం దరఖాస్తు చేయడానికి పౌరసత్వానికి సంబంధించిన సాక్ష్యాధారం అక్కర లేదు. అరుదైన సందర్భాల్లో ప్రజా సంబంధాల అధికారికి గనుక దరఖాస్తుదారు పౌరసత్వంపై అనుమానం వస్తే సాక్ష్యాధారాలు చూపించమని అడగవచ్చు. అయితే సమాచారం వెల్లడికి నిరాకరించే క్రమంలోనే హోం శాఖ ఇలాంటి కారణాలు చూపిస్తోందని దూబే అంటూ ఇలాంటి చర్యలను ప్రోత్సహించకూడదని అన్నారు.