జాతీయ వార్తలు

పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: ప్రభుత్వ ఉద్యోగాలను పొందడానికి పోటీ పరీక్షలకు తయారయ్యే ఎస్‌సి, ఒబిసి విద్యార్థులు తీసుకునే శిక్షణకు అయ్యే వ్యయం మొత్తాన్ని ఇకనుంచి కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం గరిష్ఠంగా రూ.20వేల వరకు వ్యయాన్ని మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది. సవరించిన ఎస్‌సి, ఒబిసి విద్యార్థులకు ఉచిత కోచింగ్ పథకం ప్రకారం శిక్షణ పొందడానికి అయ్యే మొత్తం వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌ను సవరించింది. ఈ పథకం కింద ఎస్‌సి, ఒబిసి విద్యార్థులకు మంచి నాణ్యమైన శిక్షణను ఇచ్చేందుకు పేరెన్నికగన్న కోచింగ్ సంస్థలను గుర్తించడం జరుగుతుందని మంత్రిత్వ శాఖలోని ఒక సీనియర్ అధికారి చెప్పారు. పాత విధానం ప్రకారం మంత్రిత్వ శాఖ శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించేది. ఆ దరఖాస్తులను ఒక కమిటీ పరిశీలించేది. సవరించిన నిబంధనల ప్రకారం.. మంచి విజయవంతమైన చరిత్ర గల కనీసం అయిదు కోచింగ్ సంస్థల నుంచి గరిష్ఠంగా పది కోచింగ్ సంస్థల పేర్లను పంపించాల్సిందిగా కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అడుగుతుంది. ఒక ఎంపిక కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి, ఆయా సంస్థలు సాధించిన విజయాల ఆధారంగా ఎంపిక చేస్తుంది. పోటీ పరీక్షలకు శిక్షణ పొందే ఎస్‌సి, ఒబిసి విద్యార్థులకు నెలవారీగా ఇచ్చే స్ట్ఫైండ్‌ను రూ. 1,500 నుంచి రూ. 2,500కు (స్థానిక విద్యార్థులకు), రూ. 3,000 నుంచి రూ. 5,000కు (ఔట్ స్టేషన్ విద్యార్థులకు) పెంచారు. వికలాంగులకు నెలకు రూ. 2,000 ప్రత్యేక అలవెన్స్‌ను ఇస్తారు. ఉద్యోగాలకోసమే కాకుండా ప్రతిష్ఠాత్మకమైన ఐఐటి-జెఇఇ, ఎఐఇఇఇ వంటి ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి, ఎఐపిఎంటి వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి, సిఎటి వంటి మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కూడా ఈ పథకం కింద ఉచిత కోచింగ్ ఇస్తారు.