జాతీయ వార్తలు

ప్రశ్నిస్తే కక్ష సాధింపే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 19: ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న సామాజిక సంస్థలు, ఎన్జీఓలపై ఎన్‌డిఏ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ధ్వజమెత్తారు. విదేశీ నిధులు పొందారన్న కారణంతో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ఆధ్వర్యంలోని సబ్‌రంగ్ ట్రస్టు లైసెన్సును రద్దు చేయడం ఇందుకు ఓ ఉదాహరణ అని ఆమె దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన తెలియజేస్తున్న ఎన్జీఓలపై పక్షపాత ధోరణితో వేధింపులకు గురిచేస్తున్నారని మాయావతి ఆరోపించారు. సబ్‌రంగ్ ట్రస్టు లైసెన్సు రద్దు వ్యవహారం ప్రభుత్వ పక్షపాత ధోరణికి నిదర్శనమని, ఇది అంతర్జాతీయ స్థాయిలోనూ నిరసనకు దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన బిఎస్‌పి సర్వసభ్య సమావేశంలో మాయావతి ఈ ఆరోపణలు చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ధ్వజమెత్తారు. ఇష్రాత్ జహాన్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కీలక ఫైళ్లు మాయం కావడంతోనే కేంద్ర ప్రభుత్వ పనితీరు ఏవిధంగా ఉందో అర్థమవుతోందని మాయావతి ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ వేముల ఆత్మహత్యకు కేంద్ర మానవ వనరుల శాఖే కారణమన్నారు. ఉత్తరప్రదేశ్‌లో హిందు- ముస్లింల అల్లర్లు జరిగేందుకు అధికార సమాజ్‌వాది పార్టీ, బిజెపి కలిసి కుట్ర పన్నాయని, ఈ అల్లర్లతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు యత్నిస్తున్నాయని మాయావతి వ్యాఖ్యానించారు. కైరానా నుంచి హిందూ కుటుంబాల వలసపై బిజెపి స్పందించింది కానీ, సమాజ్‌వాది పార్టీ కిమ్మనలేదని, ఈ కుట్రలో ఈ రెండు పార్టీలు భాగస్వాములేనని తేటతెల్లమైందని మాయావతి వ్యాఖ్యానించారు.

లక్నోలో ఆదివారం నిర్వహించిన బిఎస్‌పి సర్వసభ్య
సమావేశంలో కార్యకర్తలకు అభివాదం చేస్తున్న మాయావతి