జాతీయ వార్తలు

హైదరాబాద్ సహా మూడు నగరాల్లో ఇడి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా తాజా చర్యలకు ఉపక్రమించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సోమవారం ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌లోని దాదాపు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి ఈ కేసుతో ప్రమేయం ఉన్న వివిధ సంస్థలకు చెందిన రూ.86 కోట్లకు పైగా విలువచేసే విదేశీ షేర్లను స్తంభింప జేసింది. ఈ సోదాల సందర్భంగా సంబంధిత సంస్థల నుంచి అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ సోదాలను నిర్వహించి కొన్ని సంస్థలకు దుబాయ్, మారిషస్, సింగపూర్‌లో గల 86.07 కోట్ల రూపాయల విలువైన వాటాలను స్తంభింపజేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో భారత వైమానికదళ మాజీ ప్రధానాధికారి త్యాగి సహా 21 మందిపై మనీ లాండరింగ్ చట్టం కింద 2014లో కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఈ ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటిష్ జాతీయుడు క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్‌ను నిందితుడిగా చేరుస్తూ ఇటీవల అభియోగపత్రాన్ని దాఖలు చేసిన విషయం విదితమే. హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో చండీగఢ్‌కు చెందిన ఏరోమాట్రిక్స్ సంస్థ కీలకపాత్ర పోషించిందని, ఆ సంస్థ డైరెక్టర్ల బోర్డులో గౌతమ్ ఖైతాన్ సభ్యుడిగా ఉన్నాడని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది.

ఆర్‌ఎస్‌ఎస్ విద్యా సంస్థల్లో
పెరుగుతున్న ముస్లిం పిల్లలు
అలహాబాద్, జూన్ 20: ఉత్తరప్రదేశ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యాసంస్థల్లో ముస్లిం పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రిపోర్టు స్పష్టం చేస్తోంది. పత్రిక సేకరించిన వివరాల మేరకు రాష్టవ్య్రాప్తంగా దాదాపు 7వేల మంది ముస్లిం పిల్లలు ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నడుపబడుతున్న 1200 పాఠశాలల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 30శాతం పెరుగుదలగా రిపోర్టు తెలిపింది. మిగతా పిల్లలతోపాటు ముస్లిం పిల్లలు కూడా ‘్భజన మంత్రాలు’, ‘శ్లోకాలు’ చక్కగా పఠిస్తున్నారని, వేద మంత్రులతోపాటు సూర్యనమస్కారం చేస్తున్నారని ఆర్‌ఎస్‌ఎస్ తెలిపింది. ఆర్‌ఎస్‌ఎస్ విద్యా సంస్థలైన సరస్వతి శిశు మందిర్, సరస్వతి విద్యా మందిర్‌లో తమ పిల్లలను చేర్పించిన ముస్లిం తల్లిదండ్రులు ఒక గౌరవంగా భావిస్తున్నారని తెలిపింది. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్లు తాము ముస్లిం వ్యతిరేకులం కాదని స్పష్టం చేసింది. ఈ పిల్లల్లో 12వ తరగతి వరకు చదువుతున్నవారు ఉన్నారని, 4672 మంది బాలురు, 2218 మంది బాలికలు ఉన్నారని పత్రిక పేర్కొంది.

సిపిఎం సీనియర్ నేతపై
బహిష్కరణ వేటు
న్యూఢిల్లీ, జూన్ 20: పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పట్ల సిపిఎంలో నెలకొన్న తీవ్ర విభేదాలు సోమవారం మరోసారి తెరమీదికి వచ్చాయి. ఈ పొత్తును వ్యతిరేకించానని చెప్పిన సిపిఎం కేంద్ర కమిటీ సీనియర్ సభ్యురాలు జగ్మతి సంగ్వాన్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో ఓటమి అనంతరం సిపిఎం కేంద్ర కమిటీ సోమవారం న్యూఢిల్లీలో తొలిసారి సమావేశమైంది. అయితే సిపిఎం అధిష్టాన నిర్ణయానికి విరుద్ధంగా కాంగ్రెస్‌తో పొత్తును వ్యతిరేకించామని పలువురు సభ్యులు స్పష్టం చేయడంతో వారిపై చర్యలు చేపట్టాలని సిపిఎం కేంద్ర కమిటీ కొరడా ఝళిపించింది.