జాతీయ వార్తలు

మనమే నెంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: ‘ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ ద్వారాలు దాదాపుగా తెరుచుకున్నాయి. ఎఫ్‌డిఐలకు భారత దేశమే నెంబర్ వన్ గమ్యస్థానం. ఇది అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు నిగ్గుదేల్చిన నిజం’ అని రెండో దశ ఆర్థిక సంస్కరణలకు సోమవారం శ్రీకారం చుట్టిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వివిధ ట్వీట్‌లలో చేసిన వ్యాఖ్యలివి. ప్రపంచంలోనే అత్యంత విస్తృత స్థాయిలో అన్ని కీలక రంగాల్లోకి ఎఫ్‌డిఐని అనుమతించిన దేశంగా భారత్‌ను ఆయన అభివర్ణించారు. దేశంలోని అన్ని రంగాల్లో పరివర్తన తీసుకు వచ్చేందుకు చేపట్టిన ఈ విస్తృత చర్యల ద్వారా ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయన్నారు. ఎఫ్‌డిఐ విధానంలో చేసిన మార్పుల వల్ల మరింత తేలిగ్గా దేశంలో వ్యాపారం చేసుకునే అవకాశాలు బలపడతాయని చెప్పారు. అలాగే దేశంలో తయారైన లేదా ఉత్పత్తి అయిన ఆహార ఉత్పత్తుల వాణిజ్యం, ఈ కామర్స్‌కు ప్రభుత్వ మార్గాల్లో నూటికి నూరుశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆస్కారం ఏర్పడుతుందని చెప్పారు. ఉపాధి, ఉద్యోగ సృష్టికి విస్తృత స్థాయిలో అవకాశాలను పెంపొందించేందుకే ఎఫ్‌డిఐ రంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అలాగే దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉపయోగం ఉంటుందని, ఇది మరింతగా బలోపేతం అయ్యేందుకూ ఆవకాశాలు బలపడతాయన్నారు. ఎఫ్‌డిఐ విధానాన్ని మరింతగా సరళీకరించడం వల్ల విదేశీ పెట్టుబడులు మరింతగా తరలి వస్తాయని, ఆదాయం, ఉపాధి అవకాశాలు పెరిగేందుకూ అవకాశాలు విస్తృతమవుతాయని వెల్లడించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్న దేశంగా, ఈ రంగంలో నెంబర్ వన్‌గా భారత్‌ను అనేక అంతర్జాతీయ ఏజెన్సీలు అభివర్ణించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 55.46బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయన్న విషయాన్ని గుర్తు చేశారు.