జాతీయ వార్తలు

టి.పిసిసి చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి పార్టీ అధిష్ఠానం రాజీనామా తీసుకుందని ఢిల్లీలో జోరుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. గత వారం ఆయన ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌ను కలుసుకున్న విషయం తెలిసిందే. నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, కొందరు శాసన సభ్యులు, మాజీ ఎంపీలు పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన నేపథ్యంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వచ్చి రాహుల్‌ను కలుసుకుని రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులను అధినాయకత్వానికి వివరించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ నుంచి రాహుల్ గాంధీ రాజీనామా తీసుకున్నారని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి.
విక్రమార్క, జానారెడ్డి నుంచి కూడా
అలాగే తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క నుంచి కూడా రాజీనామా తీసుకున్నట్లు తెలుస్తోంది. భట్టి విక్రమార్క గత శనివారం ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీతో సమావేశమైన విషయం తెలిసిందే. ఇదిలావుంటే, తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకత్వ పదవికి రాజీనామా చేసి పార్టీని పటిష్టం చేస్తానని ప్రకటించిన కె.జానారెడ్డి రాష్ట్రంలో పార్టీ పరిస్థితి దిగజారిపోతున్నందుకు నైతిక బాధ్యత వహించి అధినాయకత్వానికి రాజీనామాను పంపించారని కొందరు నాయకులు చెబుతున్నప్పటికీ ఆ విషయం నిర్ధారణ కాలేదు. తెలంగాణలో పిసిసిని పునర్ వ్యవస్థీకరించాలని భావిస్తున్న అధినాయకత్వం అందులో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క నుంచి రాజీనామాలు లేఖలు తీసుకుందని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. ఎఐసిసి (అఖిల భారత కాంగ్రెస్ కమిటీ), సిడబ్ల్యుసి (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ)లతో పాటు పిసిసిలను పునర్ వ్యవస్థీకరించాలన్న ఆలోచనతోనే అధినేత్రి సోనియా గాంధీ అందరి నుంచి రాజీనామాలు తీసుకుంటున్నారని, చాలా రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు ఇప్పటికే తమ రాజీనామాలు పంపించారని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎంపీల్లో ఒకరు పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరడం అధినాయకత్వానికి ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. సుఖేందర్ రెడ్డి త్వరలో లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి శాసన మండలికి వెళతారని చెబుతున్నారు. ఆయన ఖాళీ చేసిన లోక్‌సభ నియోకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి విజయం సాధిస్తే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి మరింత అధ్వాన్నంతగా తయారవుతుందని భయపడుతున్న అధినాయకత్వం తెలంగాణలో పార్టీని బతికించుకునేందుకు సమర్ధుడైన నాయకుడిని పిసిసి చీఫ్‌గా నియమించాలని కొంత మంది రాష్ట్ర నాయకులు చేస్తున్న వాదనతో ఏకీభవిస్తోంది.