జాతీయ వార్తలు

రాహుల్ విదేశీ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: కొద్దిరోజుల పర్యటన నిమిత్తం విదేశానికి వెళ్తున్నానని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. అయితే ఏ దేశానికి వెళ్తున్నదీ ఆయన స్పష్టం చేయలేదు. ‘కొద్ది రోజుల పర్యటన నిమిత్తం దేశాన్ని వీడి వెళ్తున్నా. 46వ జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం నాకు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ ప్రేమాభిమానాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి’ అని రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గత ఏడాది రాహుల్ గాంధీ 56 రోజుల పాటు దేశం నుంచి అదృశ్యమవడంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరగడంతో పాటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌లో కూడా ఆ విషయం ప్రస్తావనకు వచ్చిన విషయం విదితమే.
అయితే 2013లో జైపూర్‌లో జరిగిన ‘చింతన్ శిబిర్’లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియమితుడైన రాహుల్ గాంధీకి త్వరలో అధ్యక్షుడిగా పదోన్నతి కల్పించడం జరుగుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.