జాతీయ వార్తలు

మహారాజ‘యోగం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూన్ 20: రెండో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని అత్యద్భుతంగా నిర్వహించుకోవటానికి దేశం పూర్తిగా సన్నద్ధమైంది. చండీగఢ్‌లో ప్రధాని నేతృత్వంలో ప్రధాన కార్యక్రమం జరుగుతుండగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒక పర్వదినంగా, పండుగగా జరుపుకోబోతోంది. ముఖ్య కార్యక్రమానికి చండీగఢ్‌లో భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రఖ్యాత ఫ్రెంచి ఆర్కిటెక్ట్ లే కర్బుజియర్, కాపిటల్ కాంప్లెక్స్‌లో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. చండీగఢ్, పంజాబ్, హర్యానాలలో ఒక్కో ప్రాంతం నుంచి పదివేల మంది చొప్పున మొత్తం 30వేల మంది ప్రజలు పాల్గొనే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం వహించనున్నారు. కాపిటల్ కాంప్లెక్స్ కాకుండా చండీగఢ్‌లోని మిగతా ప్రాంతాల్లో మరో పదివేల మంది యోగ దినోత్సవంలో పాల్గొనబోతున్నారు. ప్రధాని పాల్గొనే కాపిటల్ కాంప్లెక్స్‌లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
కాపిటల్ కాంప్లెక్స్‌లో ప్రత్యేకంగా ‘సెల్ఫీ’ జోన్‌లను ఏర్పాటు చేశారు. బాగా ప్రదర్శన చేసిన వారికి కేంద్రపాలిత చండీగఢ్ పాలనా యంత్రాంగం నగదు బహుమతులనూ ప్రకటించింది. యోగ కార్యక్రమంలో పాల్గొన్న వారు తమ ఫోటోలను చ్ఘిషళఇ్య్యరీ.ష్యౄ/జకజూష్దజూ2016లో పోస్ట్ చేయ టం కానీ, లేదా జకజూష్దజూ2016కు ట్వీట్ చేయటం కానీ చేయవచ్చని చత్తీస్‌గఢ్ హోం శాఖ కార్యదర్శి అనురాగ్ అగర్వాల్ తెలిపారు. ప్రథమ బహుమతిగా రూ10వేలు, ద్వితీయ బహుమతిగా రూ.8 వేలు, తృతీయ బహుమతిగా రూ.5వేలు అందిస్తామని ఆయన తెలిపారు. యోగ కార్యక్రమంలో ప్రధాన కార్యక్రమాలు ఈ విధంగా ఉంటాయి.
ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమం కాపిటల్ కాంప్లెక్స్‌లో ప్రధాన కార్యక్రమం ఉదయం గం.6.30కు ప్రారంభమవుతుంది.
ఉదయం 7గంటల నుంచి 45 నిమిషాల పాటు యోగా కార్యక్రమం జరుగుతుంది.
కాపిటల్ కాంప్లెక్స్‌లో 5వేల మంది పోలీసులను మోహరించారు.
పారామిలటరీ బలగాలు రెప్ప వాల్చకుండా నిఘా నిర్వహిస్తున్నాయి.
ఆకస్మిక వర్ష సూచన ఉండటంతో ముందుజాగ్రత్తలు చెప్పేందుకు వాతావరణ శాఖ అధికారులనూ కార్యక్రమ ప్రాంగణానికి రప్పిస్తున్నారు.
భాగస్వాముల కదలికలను గమనించేందుకు ప్రత్యేక రేడియో ఫ్రీక్వెన్సీని ఈ ప్రాంగణంలో అనుసంధానం చేశారు.
కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ ఎల్ ఈ డీ తెరలను ఏర్పాటు చేశారు.
యోగా ఫ్లాష్ మాబ్, మూన్‌లైట్ యోగా, యోగా రన్‌లను కూడా ఏర్పాటు చేశారు.
సుఖ్నా లేక్ వద్ద యోగాపై 3-డి చిత్రాలను ప్రదర్శిస్తున్నారు.

దేశమంతటా కార్యక్రమాలు
న్యూఢిల్లీ: చండీగఢ్‌తో పాటు దేశమంతటా పెద్ద ఎత్తున యోగ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున సన్నాహాలు చేశాయి. దేశ రాజధానిలో ఇప్పటికే యోగ ఒలింపియాడ్ ప్రారంభమైంది. రాజ్‌పథ్ మార్గంలో జరిగే కార్యక్రమంలో భారీగా ప్రజలు భాగస్వాములు కానున్నారు. వివిధ దేశాల దౌత్యవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 57మంది కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల్లో యోగ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా యోగ దినోత్సవాన్ని ప్రముఖంగా నిర్వహిస్తున్నాయి.

నేడు సెలవు దినం కాదు
ప్రభుత్వ ఉద్యోగులకు యోగ స్వచ్ఛందమే
న్యూఢిల్లీ, జూన్ 20: అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని జరుపుకుంటున్న మంగళవారం కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు దినాన్ని ప్రకటించలేదు. ఉద్యోగులకు మంగళవారం సెలవు దినంగా ప్రకటించలేదని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తెరిచే ఉంటాయని కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. ఉద్యోగులు యోగ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయలేదని, కనుక ఎవరైనా స్వచ్ఛందంగా యోగ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని ఆయన స్పష్టం చేశారు. యోగ దినోత్సవం సందర్భంగా మంగళవారం దేశ వ్యాప్తంగా జరుగనున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రభుత్వ ఉద్యోగులకు వీలు కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆ అధికారి తెలిపారు.

జాతీయ యోగ ఒలింపియాడ్‌లో జరుగుతున్న ఏర్పాట్లు