జాతీయ వార్తలు

ఎఫ్‌డీఐలు వందశాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా
అనూహ్య స్థాయిలో ఆర్థిక సంస్కరణలు
రక్షణ, పౌర విమానయానానికీ అడ్డులేదు
సానుకూలంగా మార్కెట్ల స్పందన

‘రెండో దశ సంస్కరణలకు నాంది పలికాం. ఉపాధి, ఉద్యోగ
అవకాశాలు వెల్లువెత్తుతాయి. ఇక దేశంలో వ్యాపారం మరింత సులభం’

న్యూఢిల్లీ, జూన్ 20: ఆర్థిక సంస్కరణల్లో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయాలను ఊహించని రీతిలో తీసుకుంది. రక్షణ సహా అన్ని కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నూటికి నూరు శాతం అనుమతిస్తూ ఎఫ్‌డీఐల విధానాన్ని అత్యంత విస్తృతమైన పరిధిలో సరళీకరించింది. సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో రెండో దశ ఆర్థిక సంస్కరణల నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. రక్షణ, పౌర విమానయానం, ఆహారోత్పత్తి, ఫార్మా, పశు సంవర్ధకం, నిర్మాణ తదితర రంగాల్లో నూటికి నూరుశాతం విదేశీ పెట్టుబడులకు తలుపులను బార్లా తెరిచింది. భారత దేశం అత్యంత పారదర్శకమైన బహిరంగ ఆర్థిక వ్యవస్థ అని ప్రపంచానికి చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ రెండోసారి పదవిలో కొనసాగనంటూ ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్‌లో ఏర్పడిన భయాన్ని పోగొట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపకరించింది. సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్, ప్రభుత్వ తాజా నిర్ణయంతో కోలుకోవటం ఇందుకు సంకేతం. ఉపాధి కల్పన, ఉద్యోగ సృష్టి కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నియమాలను పెద్ద ఎత్తున సరళీకృతం చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఎన్‌డిఏ ప్రభుత్వం 2015లో మొదటి సారి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నియమాలను సరళీకృతం చేయటం తెలిసిందే. ఎన్‌డిఏ ప్రభుత్వం ఈరోజు తీసుకున్న నిర్ణయం మూలంగా కొన్ని ఎంపిక చేసిన రంగాలు మినహా మిగతా అత్యధిక రంగాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆటోమెటిక్ అనుమతుల విధానంలోకి వస్తాయి. ఎఫ్‌డిఐల విధానాన్ని అత్యంత సరళీకృతం చేయటంతో భారతదేశం ఇప్పుడు దాదాపుగా పూర్తిస్థాయి బహిరంగ ఆర్థిక వ్యవస్థ పరిధిలోకి వచ్చినట్లయింది. ఎన్‌డిఏ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి రక్షణ, నిర్మాణం, బీమా, పెన్షన్ రంగం, ప్రసారరంగం, టీ, కాఫీ, రబ్బర్, కార్డిమమ్, పాం ఆయిల్, ఆలీవ్ ఆయిల్ ట్రీ ప్లాంటేషన్, సింగిల్ బ్రాండ్ రిటేల్ ట్రేడింగ్, ఉత్పాదక రంగం, పరిమిత బాధ్యత భాగస్వామ్యం, పౌర విమానయానం, క్రెడిట్ సమాచార సంస్థలు, ఉపగ్రహ సంస్థలు, ఆస్తుల పునర్ వ్యవస్థీకరణ సంస్థల రంగాల్లో ఎన్నో సంస్కరణలు చేయటంతోపాటు ఆర్థిక విధానాలను సరళీకృతం చేసింది. ఈ చర్యల మూలంగా 2015-16 సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 55.46 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర తరలి వచ్చాయి. ఆంతకు ముందు సంవత్సరం ఇది కేవలం 36.04 బిలియన్ అమెరికన్ డాలర్లు మాత్రమే. తాజా నిర్ణయంతో వచ్చే ఆర్థిక సంవత్సరం భారీగా ఎఫ్‌డీ ఐలు వస్తాయని ప్రభుత్వ అంచనా.
కొత్త విధానం ప్రకారం విదేశీ విమానయాన సంస్థలు మినహా మిగతా సంస్థల్లో నూరుశాతం ఎఫ్‌డిఐలను అనుమతిస్తారు. గతంలో కేవలం 49శాతం మాత్రమే ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతించేవారు. అంతకు మించి పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవలసి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు.
రక్షణ రంగంలో ఇప్పటివరకు ఉన్న ఆధునిక టెక్నాలజీ అన్న నియమాన్ని సవరించి ఆధునిక లేక ఇతర కారణాలు అంటూ సవరించారు. తద్వారా నూరు శాతం పెట్టుబడులకు అనుమతిచ్చారు. బ్రాడ్ క్యాస్టింగ్ క్యారేజీ సర్వీసుల రంగం ప్రవేశ విధానాన్ని పున: సమీక్షిస్తారు. ఆహారోత్పత్తి, ఫార్మా రంగంలో కూడా 100 శాతం ఎఫ్‌డిఐలను అనుమతిస్తారు. ప్రైవేట్ భద్రత సంస్థల్లో ఎఫ్.డి.ఐని అటోమెటిక్ రూట్‌లో 49 శాతం, ప్రభుత్వ అనుమతితో 74 శాతాన్ని అనుమతిస్తారు. శాఖా కార్యాలయాలు, లైజనింగ్ కార్యాలయాలు, ప్రాజెక్టు కార్యాలయాల ఏర్పాటుకు కూడా అనుమతి మంజూరు చేస్తారు. 100 శాతం ఎఫ్‌డిఐని అనుమతిస్తున్న పశు సంవర్థక శాఖలో ఇక మీదట ‘కంట్రోల్డ్ కండీషన్స్’ విధానాన్ని తొలగిస్తారు. సింగ్‌ల్ బ్రాండ్ రిటేల్ ట్రేడింగ్ రంగంలో స్థానికంగా సేకరించాలనే షరతుకు మూడు సంవత్సరాల మినహాయింపు ఇస్తారు. ఇదే విధంగా రిలాక్స్‌డ్ సోర్సింగ్ రిజీమ్‌ను అయిదేళ్ల వరకు అనుమతిస్తారు.