జాతీయ వార్తలు

వీడని పీటముడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూన్ 22: కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి జోక్యం చేసుకున్నా ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగంపై తలెత్తన వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనిపించటం లేదు. కృష్ణా జలాల వివాదం చివరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వైపుదారి తీస్తోంది. ఉమాభారతి సలహా మేరకు బుధవారం సాయంత్రం ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు,తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి అమర్‌జీత్ సింగ్ సమక్షంలో జరిపిన చర్చలు ఘోరంగా విఫలమయ్యియి. ఇరువురు మంత్రులు ఎడ మొహం, పెడ మొహంతో చర్చలు జరపటంతో సమస్య మరింత జటిలంగా తయారైంది. రెండు రాష్ట్రాల మంత్రులు రేపుఉదయం మరోసారి అమర్‌జీత్ సింగ్ సమక్షంలో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశం కూడా ఫలించని పక్షంలో ఉమాభారతి వారితో చర్చలు జరిపే అవకాశాలున్నాయి.
ఇరువురు మంత్రులు సమావేశానంతరం పరస్పర విమర్శలకు దిగటంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అసలు సమస్య పరిష్కార అవకాశాలే మృగ్యమయ్యే పరిస్థితి తలెత్తింది. చర్చల వైఫల్యానికి మీరు కారణమంటే మీరు కారణమంటూ ఇరువురు మంత్రులు పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారు. ఇద్దరు మంత్రులు కూడా తమ,తమ వాదనలకే కట్టుబడి ఉండటంతో కృష్ణా జలాల పంపిణీ సమస్యకు కనుచూపు మేరలో పరిష్కారం కనిపించటం లేదు.
అమర్‌జీత్ సింగ్ గత రెండు రోజులుగా కృష్ణా జలాల సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు విస్తృతంగానే ప్రయత్నించారు. ఇందులో భాగంగానే రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇంజనీరింగ్ చీఫ్‌లతో జరిగిన చర్చలు ఘోరంగా విఫలమయ్యాయి. మంగళవారం వీరి మధ్య తొమ్మిది గంటల పాటు మంతనాలు జరిగాయి. బుధవారం కొద్ది సేపు చర్చించినా పరిష్కారం కుదరలేదు. దీనితో ఉమాభారతి జోక్యం చేసుకోకతప్ప లేదు. ఉమాభారతి సలహా మేరకే అమర్‌జీత్ సింగ్ రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల ముఖా,ముఖి చర్చలు ఏర్పాటు చేశారు. నదుల అనుసంధానం జరుగుతున్న సమావేశానికి వచ్చిన రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖల మంత్రులతో సమావేశమై సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఉమాభారతి భావించారు. అయితే అనివార్య కారణాల మూలంగా ఆమెకు బదులు అమర్‌జీత్ సింగ్ ఈ ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ చర్చలకు హాజరయ్యేందుకు మొదటి ఇద్దరు మంత్రులు విముఖత చూపించారు. దీనితో అమర్‌జీత్ సింగ్ విజ్ఞాన్ భవన్‌లోనే మొదట దేవినేని ఉమ, ఆ తరువాత హరీష్‌రావులతో విడి,విడిగా చర్చలు జరిపారు. ఆ తరువాత ఇరువురితో సమావేశం జరిపారు. ఈ సమావేశంలో ఇరువురు మంత్రులు తమ,తమ వాదనలకే కట్టుబడి ఉండటంతో అంగీకారం కుదరలేదు. ఆయన ఎంతగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఇరు రాష్ట్రాల మంత్రులు తమ పట్టు సడలించలేదు. దీనితో అమర్‌జీత్ సింగ్ పరిస్థితిని టెలిఫోన్‌లో ఉమాభారతికి వివరించి ఆమె సలహా మేరకే రేపు మరోసారి ఇరువురు మంత్రులతో ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో కూడా అంగీకారం కుదిరే అవకాశాలు కనిపించటం లేదు.

చిత్రం... జలవనరుల శాఖ కార్యదర్శి అమర్‌జీత్ సింగ్‌తో సమావేశమైన తెలంగాణ, ఆంధ్ర మంత్రులు హరీశ్‌రావు, ఉమామహేశ్వర రావు