జాతీయ వార్తలు

మీరు మొండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: ఆంధ్ర మొండి వైఖరి కారణంగానే కృష్ణా నదీ జలాల వినియోగంపై అవగాహన కుదరటం లేదని తెలంగాణ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కేంద్ర జల వనరుల మంత్రి ఉమా భారతి సూచనతో ఏపీ నీటి పారుదల మంత్రి దేవినేని ఉమతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని బుధవారం రాత్రి మీడియా సమావేశంలో హరీశ్ ప్రకటించారు. ఇక్కడ విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్‌జీత్ సింగ్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల మంత్రులు చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఏకపక్ష వైఖరివల్ల అవగాహన కుదరలేదని, గురువారం ఉదయం మరోసారి సమావేశం కానున్నట్టు వెల్లడించారు. నాగార్జునసాగర్‌తోపాటు కెసి కెనాల్, పోతిరెడ్డిపాడు తదితర ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెస్తే, కృష్ణా జలాల పంపిణీ బాధ్యతను బోర్డుకు అప్పగించేందుకు తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అలాకాకుండా నాగార్జున సాగర్‌ను మాత్రమే బోర్డు పరిధిలోకి తేవాలని పేచీ పెట్టడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. సాగర్ పరిధిలోని అన్ని ప్రాజెక్టుల నీటి పంపిణీ వ్యవహారాన్నీ బోర్డు పరిధిలోకి తేవాలన్న తమ ప్రతిపాదనను ఆంధ్ర ఒప్పుకోవడం లేదన్నారు. ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా జలాల పంపిణీ జరగాలనే తాము కోరుకుంటున్నామన్నారు. కృష్ణా బోర్డు పంపిణీ పర్యవేక్షణకే తప్ప, ప్రాజెక్టుల నిర్వహణ కోసం కాదన్నారు. ఆంధ్ర సర్కారు వితండవాదం వల్ల సమస్య పరిష్కారం కావటం లేదన్నారు. సాగర్ కుడి కాల్వ నియంత్రణను ఏపీ కోరడం వితండవాదం కాదా? ప్రపంచంలో ఎక్కడైనా ఇలా ఉందా? అంటూ హరీశ్ నిలదీశారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు గేట్లు ఎత్తేస్తామంటే కుదురుతుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డు ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఏపీది, నాగార్గున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణాది. దీనికే తాము కట్టుబడి ఉన్నామన్నారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం పోలవరం నిర్మాణం పూర్తికాగానే పైరాష్ట్రాలకు హక్కు కలుగుతుంది కాబట్టి, 45 టిఎంసి జలాలు అడుగుతున్నామన్నారు.
పట్టిసీమ పోలవరంలో భాగం కాదన్నారు కనుకే, దానినుంచి తీసుకుపోయే 40 టిఎంసిల జలాలు తెలంగాణకూ ఇవ్వాలన్నారు. 90 టిఎంసి ఆంధ్రకు మళ్లిస్తున్నారు, మాకూ ఇవ్వండని నిలదీస్తే తప్పా అని ప్రశ్నించారు. జలాల విషయంలో పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకతో నెరపుతున్న సత్సంబంధాలే, ఆంధ్రనుంచీ కోరుతున్నామని హరీశ్ వెల్లడించారు. మల్లన్న సాగర్, పాలమూరు ప్రాజెక్టుల విషయంలో విపక్షాలు ఒంటెత్తుపొకడ పోతున్నాయన్నారు. మల్లన్నసాగర్‌ను అడ్డుకోవడమంటే అభివృద్దిని అడ్డుకోవటమేనని స్పష్టం చేశారు. విపక్షాలు గోల చేస్తున్నట్టు ప్రాజెక్టు విషయంలో అవినీతికి తావులేదని, రైతులు ఎలా కోరుకుంటే అలా చేస్తామని హరీశ్ హామీ ఇచ్చారు. రాష్ట్రాల అంగీకారం లేకుండా నదుల అనుసంధానం జరగదని ఉమాభారతి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.