జాతీయ వార్తలు

మా మద్దతు మీకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: అణు సరఫరాదారుల గ్రూప్‌లో (ఎన్‌ఎస్‌జి) భారత్‌కు సభ్యత్వం విషయంలో క్రమంగా మద్దతు బలపడుతోంది. ఎన్‌పిటిపై సంతకం చేసిన దేశాలకే ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కల్పించాలన్న చైనా అభ్యంతరం నేపథ్యంలో తాజాగా ఫ్రాన్స్ కూడా భారత్‌ను బలపరిచింది. 48 దేశాల ఎన్‌ఎస్‌జిలో కీలక సభ్య దేశంగా ఉన్న ఫ్రాన్స్ మద్దతు లభించడం భారత్ సభ్యత్వ ప్రయత్నాలకు మరింత ఊతం లభించినట్టయింది. మరిన్ని దేశాల మద్దతును సమకూర్చుకునే లక్ష్యంతో భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ ఎన్‌ఎస్‌జి కీలక ప్లీనరీ జరుగనున్న సియోల్‌కు బయలుదేరారు. గురువారం నుంచి జరిగే ఈ ప్లీనరీ సమావేశాల్లో తనకు ఎన్‌ఎస్‌జి సభ్యత్వం దక్కుతుందని భారత్ గట్టిగా ఆశిస్తోంది. అయితే ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు సభ్యత్వం ఇవ్వడాన్ని చైనా, మరికొన్ని దేశాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. సోమవారం ప్రారంభమైన 48 దేశాల ఎన్‌ఎస్‌జి అధికారుల స్థాయి సమావేశంలో సాగుతున్న చర్చలను, పరిణామాలను లోతుగా పరిశీలిస్తున్న జైశంకర్.. భారత్‌కు సభ్యత్వం విషయంలో ఎన్‌ఎస్‌జిలోని వివిధ దేశాల మద్దతు కూడగట్టడానికి సియోల్‌కు బయల్దేరారు. భారత విదేశీ వ్యవహారాల శాఖలో సీనియర్ అధికారి, ‘డిజార్మమెంట్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటి’ డివిజన్ ఇన్‌చార్జి అమన్‌దీప్ సింగ్ గిల్ ఇప్పటికే సియోల్‌కు చేరుకొని భారత్‌కు ఎన్‌ఎస్‌జి సభ్యత్వం కోసం వివిధ దేశాల మద్దతు కూడగడుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు ఎందుకు చోటు కల్పించాలనే విషయమై ఆయన వివిధ దేశాలకు వివరిస్తున్నారని ఆ వర్గాలు చెప్పాయి. అయితే చైనా మాత్రం ఇప్పటికీ ఎన్‌ఎస్‌జిలో భారత ప్రవేశానికి అడ్డు తగులుతోంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయని భారత్ వంటి దేశాలకు సభ్యత్వం కల్పించే విషయంలో ఎన్‌ఎస్‌జి సభ్య దేశాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్‌ఎస్‌జిలోని మెజారిటీ దేశాలు భారత్‌కు మద్దతు ఇస్తుండగా, చైనాతో పాటు టర్కీ, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, న్యూజిలాండ్ దేశాలు మాత్రం భారత్ చేరిక ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. భారత్ ఎన్‌పిటిపై సంతకం చేయలేదని చైనా వాదిస్తోంది. ఒకవేళ భారత్‌కు మినహాయింపులు ఇచ్చి ఎన్‌ఎస్‌జి సభ్యత్వం కల్పిస్తే తనకు సన్నిహిత దేశమైన పాకిస్తాన్‌కు కూడా సభ్యత్వం కల్పించాలని చైనా ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా, ఎన్‌ఎస్‌జిలో చేరడానికి ఎన్‌పిటిపై సంతకం చేసి ఉండటం తప్పనిసరి కాదని పేర్కొంటూ, ఈ విషయంలో ఫ్రాన్స్ ఉదంతాన్ని భారత్ ప్రస్తావిస్తోంది.