జాతీయ వార్తలు

భూకేటాయింపుల రద్దుపై కేంద్రానికి నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: గతంలో వివిధ సంస్థలకు జరిపిన 29 భూ కేటాయింపులను రద్దుచేస్తూ యుపిఏ ప్రభుత్వం తీసుకున్న చర్యను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన కమిటీ బుధవారం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు తన నివేదికను సమర్పించింది.
ఈ సంస్థల్లో చాలావరకు ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉండేవే. అంతకుముందు ఎన్డీయే ప్రభుత్వ హయాంలో జరిపిన ఈ భూకేటాయింపులను యుపిఏ ప్రభుత్వం 2004లో రద్దు చేసింది. ‘ఈ సంస్థలకు జరిపిన భూ కేటాయింపులను రద్దు చేయడంపై సమీక్షించిన కమిటీ ఈ రోజు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు తన నివేదికను సమర్పించింది’ అని ఒక అధికారి చెప్పారు.
అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వివిధ సామాజిక-సాంస్కృతిక సంస్థలు, ధార్మిక సంస్థలకు 32 భూ కేటాయింపులు జరిపింది. ఈ సంస్థల్లో సమర్థ్ శిక్షా సమితి, అఖిల భారతీయ వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్, భారతీయ కిసాన్ సంఘ్, సేవా భారతి, స్వదేశీ జాగరణ్ ఫౌండేషన్‌లాంటి ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉండే లేదా దాని మద్దతు ఉండే సంస్థలు 22 ఉన్నాయి. అయితే కేటాయింపులు జరిపే సమయంలో నిబంధనలను పాటించలేదంటూ యుపిఏ ప్రభుత్వం 2004లో 29 కేటాయింపులను రద్దు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అదికారి యోగేశ్ చంద్ర నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్య దర్యాప్తు కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 2014లో ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ సంస్థలు గత యుపిఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని పట్టణాభివృద్ధి శాఖను ఆశ్రయించాయి. దీంతో ప్రభుత్వం ఈ కేటాయింపుల రద్దు నిర్ణయాన్ని సమీక్షించడానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్‌కె జోషీ, ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆర్ నారాయణస్వామిలతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
కాగా, యుపిఏ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ, ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు పెండింగ్‌లో ఉన్నందున ప్రభుత్వం ఈ నివేదికను ఢిల్లీ హైకోర్టుకు కూడా సమర్పించవచ్చని తెలుస్తోంది.