జాతీయ వార్తలు

ఒక దేశం పదే పదే అడ్డంకులు సృష్టించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాష్కెంట్, జూన్ 24: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో సభ్యత్వం కోసం తన దరఖాస్తును ఎన్‌ఎస్‌జి తిరస్కరించడంతో తన దరఖాస్తుపై కూటమిలో చర్చ సందర్భంగా ఒక దేశం పదే పదే నిబంధనల పేరిట అడ్డంకులు సృష్టించిందంటూ పరోక్షంగా చైనాపై భారత్ మండిపడింది. అంతేకాదు, ఎన్‌ఎస్‌జిలో భారత్ చేరి ఉంటే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మరింత బలపడి ఉండేదని, ప్రపంచ అణు వాణిజ్యం మరింత సుభద్రం అయి ఉండేదని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పష్టం చేశారు. సియోల్‌లో జరిగిన రెండు రోజుల ప్లీనరీ సమావేశంలో ఎన్‌ఎస్‌జి అంతర్జాతీయ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి మూలస్తంభంగా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)ను సంపూర్ణంగా, సమర్థవంతంగా అమలు చేయడానికి నిర్ణయించడమే కాకుండా, దీనినుంచి భారత్‌కు మినహాయింపు ఇవ్వడానికి నిరారించిన విషయం తెలిసిందే. అయితే ఎన్‌పిటిపై సంతకం చేయడానికి, ఎన్‌ఎస్‌జితో భారత్ కలిసి పని చేయడానికి మధ్య ఎలాంటి వ్యత్యాసము లేదని భారత్ వాదిస్తోంది.‘ఒక దేశం పదే పదే నిబంధనలకు సంబంధించి అభ్యంతరాలను లేవనెత్తినప్పటికీ ఎన్‌ఎస్‌జిలో భవిష్యత్తులో భారత్ పాల్గొనడంపై నిన్న రాత్రి దాదాపుమూడు గంటల సేపు చర్చ జరిగినట్లు మాకు అర్థమయింది’ అని వికాస్ స్వరూప్ ఇక్కడ విలేఖరులతో అన్నారు.
అంతకు ముందు జరిగిన ఎన్‌ఎస్‌జి ప్లీనరీ సమావేశం భారత్‌కు కూటమిలో తక్షణం సభ్యత్వం ఇవ్వడానికి నిరాకరిస్తూ ఎన్‌పిటిపై సంతకం చేయని దేశాలకు భాగస్వామ్యం కల్పించడంపై చర్చలను కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
‘సమావేశంలో పాల్గొన్న దాదాపు అన్ని దేశాలు భారత్ సభ్యత్వానికి మద్దతు ఇవ్వడమే కాకుండా భారత్ సభ్యత్వానికి అనుకూలంగా మాట్లాడాయి. ఆ దేశాలన్నిటికీ మేము పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే స్థూల మనోభావం వ్యక్తమయిందని మాకు అర్థమవుతోంది’ అని స్వరూప్ చెప్పారు.