జాతీయ వార్తలు

గ్రేటర్ ఎన్నికలు జనవరిలో వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థకు జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించటానికి తెరాస ప్రభుత్వం తీవ్రస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బిజెపి, టిడిపిలు ఆరోపించాయి. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమినర్‌ను కలిసి ఫిర్యాదు చేశాయ. సోమవారం రెండు పార్టీలకు చెందిన నేతలు ఎన్నికల కమిషనర్‌తో సమావేశమై తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు. ఎన్నికలను జనవరిలో నిర్వహిస్తామని మంత్రి కెటిఆర్ చేసిన ప్రకటనపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎన్నికలను ఎప్పుడు నిర్వహించేది చెప్పే అధికారం మంత్రి కెటిఆర్‌కు ఎవరిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా జనవరి పండుగ సీజన్ కాబట్టి ఎన్నికలను నిర్వహించవద్దని బిజెపి, టిడిపిలు ఇసికి చెప్పాయి. వీలున్న మేరకు వివిధ వర్గాలను ఓటింగ్ నుంచి దూరంగా ఉంచడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఈ ప్రతినిధి వర్గం ఆరోపించింది. ఎన్నికల సంఘం నిర్వహించాల్సిన బాధ్యతలను తెరాస ప్రభుత్వం నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఇసిపై వత్తిడి పెంచుతోందని విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణ ముసుగులో సుమారు ఏడున్నర లక్షల మంది పేర్లు తొలగించారని ప్రతినిధి వర్గం ఆరోపించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను వెనకబడిన తరగతులలో చేర్చారని ఇసి దృష్టికి తెచ్చారు. 2015 నవంబర్ 15నాటికి తయారైన ఓటర్ల జాబితాను పక్కన పెట్టి సెప్టెంబర్ 15నాటికి తయారై ఉన్న జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బిజెపి మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, నగర శాఖ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, మాగంటి గోపీనాథ్, అరికేపూడి గాంధీ తదితరులు ఎన్నికల కమిషనర్లను కలిసిన బృందంలోఉన్నారు.