జాతీయ వార్తలు

మనం బలంగా ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూన్ 24: ఐరోపా దేశాల కూటమి నుండి బయటకు రావాలని బ్రిటన్ నిర్ణయించుకున్న నేపథ్యంలో నేపథ్యంలో బ్రెగ్జిట్ ఫలితాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి మంత్రి అరుణ్‌జైట్లీ భరోసా ఇచ్చారు. బ్రిటన్ యూరో నుంచి బయటకు రావడం వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ప్రచారం జరుగుతున్న సమయంలో జైట్లీ శుక్రవారం ఈ ప్రకటన చేయటం గమనార్హం. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్నదానిపై జరిగిన ఓటింగ్‌లో దానికి అనుకూలంగా బ్రిటన్ ప్రజలు తీర్పునివ్వడంతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. బంగారం ధరలు గత రెండు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. బ్రిటీష్ ప్రజల తీర్పును భారత దేశం గౌరవిస్తుందని జైట్లీ స్పష్టం చేశారు. ‘బ్రిటన్‌లో జరిగిన రిఫరెండంను గౌరవిస్తున్నాం. రిఫరెండం ప్రభావం మున్ముందు ఎలా ఉం టుంది? ముఖ్యంగా స్వల్పకాలంలో ఎలా ఉంటుందనేది మాకు తెలుసు’ అని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు. ప్రపంచీకరణంలో కుదుపులు, అనిశ్చితి అనేవి కొత్త నిబంధనలనేది తాను పలుమార్లు చెప్పానని ఆయన గుర్తుచేశారు. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలంటూ బ్రిటన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇవి మరింత పెరుగుతాయని ఆయన చెప్పారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం వల్ల బ్రిటన్, ఐరోపా దేశాలు, మిగతా దేశాలపై ఏ మేరకు ప్రభావం పడుతుందనేది ఇంకా స్పష్టం కాలేదన్నారు. బ్రిటన్ రిఫరెండం వల్ల ఎదురయ్యే ఒడుదుడుకులను ఎక్కువ కాలం ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని జైట్లీ పిలుపునిచ్చారు. మధ్యతరహా ఒడుదుడుకుల కోసం జాగ్రత్తగా పరిశీలించాలని ఆయన సూచించారు. బ్రెగ్జిట్ మూలంగా ఎదురయ్యే అన్ని రకాల ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆర్థిక మంత్రి పునరుద్ఘాటించారు.
ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేందుకు మన మైక్రో ఎకనమిక్ ప్రేం వర్క్‌కు కట్టుబడి ఉన్నామని జైట్లీ ప్రకటించారు. మైక్రో ఆర్థిక పరిస్థితి ఎంతో స్థిరంగా ఉందని, ఆర్థిక క్రమశిక్షణ, ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. మూల నిధుల పరిస్థితి కూడా ఆరోగ్యకరంగా ఉండటం మూలంగా తక్షణ, మధ్యతరహా రక్షణ కవచాలు పటిష్టంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఆర్థిక స్థిరత్వం ఉన్న దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకే పెట్టుబడి దారులు ఇష్టపడతారంటూ భారత్‌లో ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి విషయంలో ఎంతో పటిష్టంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. బ్రెగ్జిట్ ప్రభావాన్ని తట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్, ఇతర రెగ్యులేటర్లు అన్నింటికి సిద్ధమై ఉన్నారని ఆయన చెప్పారు. బ్రెగ్జిట్ ప్రభారం భారత్ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తట్టుకోగల సామర్ధ్యం భారత్‌కు వుందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఇప్పటికిప్పుడు ఒడిదుడుకులకు గురైనప్పటికీ తెప్పరిల్లుతుందని, అంతా సర్దుకుంటుందని ఆయన విశే్లషించారు. రిజర్వ్‌బ్యాంక్, ఆర్థిక మంత్రిత్వశాఖ పరిస్థితులను మదింపుచేసుకుంటూ ముందుకెళ్తున్నాయని, ఎలాంటి ఢోకాలేదని ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా అన్నారు.బ్రిగ్జిట్ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఉండదని బ్యాంకింగ్ కార్యదర్శి అంజులే దుగ్గల్ స్పష్టం చేశారు.