జాతీయ వార్తలు

గడువు దాటితే.. అంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గడువులోగా నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడిస్తే.. ఆ సంపద వివరాలను అడిగే ప్రసక్తే ఉండదు. అయితే అక్రమార్జనపై కొంత జరిమానా చెల్లించి తదుపరి సమస్యల నుంచి పూర్తిగా బయటపడిపోవచ్చు. సెప్టెంబర్ 30తో ముగిసే చివరి గడువును పొడిగించే ప్రసక్తే ఉండదు.

న్యూఢిల్లీ, జూన్ 26: నల్లధనాన్ని వెల్లడించడానికి ప్రభుత్వం కల్పిస్తున్న చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 30తో తుది గడువు ముగుస్తుందని, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గడువును పెంచే ప్రసక్తే ఉండదని తెలిపారు. ఆ లోగా నల్లధన ఖాతాలను వెల్లడించని వారు తదుపరి పరిణామాలు, పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్‌కి బాత్‌లో మోదీ స్పష్టం చేశారు. గడువులోగా నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడిస్తే.. ఆ సంపద వివరాలను అడిగే ప్రసక్తే ఉండదన్నారు. అయితే అక్రమార్జనపై కొంత జరిమానా చెల్లించి తదుపరి సమస్యల నుంచి పూర్తిగా బయటపడిపోవచ్చునన్నారు. అందుకే స్వచ్ఛందంగానే గడువులోగా నల్లధనాన్ని వెల్లడించాలని కోరుతున్నానని, ఆ విధంగా పారదర్శక విధానంలో మమేకం కావాలని అభ్యర్థిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. సెప్టెంబర్ 30తో ముగిసే చివరి గడువును పొడిగించే ప్రసక్తే ఉండదని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. గడువు తీరినా నల్లధన వివరాలను వెల్లడించని వారిపై అధికారులు చర్యలు తీసుకునే పక్షంలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని తాను బిజెపి ఎంపీలందరికీ విస్పష్టంగా తెలియజేశానన్నారు. ఒకప్పుడు ఆదాయంపై కట్టాల్సిన పన్నులు చాలా ఎక్కువగా ఉండటం వల్ల వాటిని తప్పించుకునేందుకే ప్రజలు ప్రయత్నించేవారని, కానీ పరిస్థితులు మారాయని, నిజంగా పన్నులు చెల్లించే వారికి అన్ని విధాలుగా సులభతరమైన అవకాశాలను కల్పిస్తున్నామని మోదీ స్పష్టం చేశారు. ‘నియమ నిబంధనల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసే..మానసిక ప్రశాంతత కోల్పోవాల్సి వస్తుంది. ఏ చిన్న అధికారి అయినా మిమ్మల్ని వేధించే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి’అంటూ నల్లధన ఖాతాదారులకు మోదీ హితవు చెప్పారు.
ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని, నమ్మకాన్ని పాదుగొలిపేలా ప్రవర్తించాలని తాను అధికారులకు ఇటీవల స్పష్టం చేసిన విషయాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మొత్తం నూట ఇరవై ఐదు కోట్ల మంది ప్రజల్లో కేవలం కోటి 50లక్షల మందికి మాత్రమే పన్నులు కట్టే ఆదాయం ఉంటోందన్న లెక్కలు ఎవరికీ మింగుడు పడనివేనన్నారు. పెద్ద నగరాల్లో 50లక్షల ఆదాయం దాటిన వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుందన్నారు. పన్నులు ఎగవేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ముందు వారికి అన్ని విధాలుగా అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.