అంతర్జాతీయం

మళ్లీ శే్వతజాతి అమెరికా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగో, జూన్ 26: అమెరికా కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న అభ్యర్థి ఒకరు శే్వత జాత్యభిమానాన్ని రెచ్చగొట్టే కటౌట్లు ఏర్పాటు చేయడం ఆగ్రహానికి గురయింది. ముఖ్యంగా ‘మేక్ అమెరికా వైట్ అగైన్’ అనే నినాదంతో కూడిన కటౌట్లను ఏర్పాటు చేయడం వివాదాస్పదం అయింది. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార నినాదం అయిన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ను పరోక్షంగా ఎత్తిపొడుస్తూ ఈ నినాదాన్ని వెలుగులోకి తెచ్చినప్పటికీ ఇది స్థానిక ప్రజల ఆగ్రహానికి గురయింది. టెనె్నస్సీ రాష్ట్రంలోని మూడవ జిల్లా కాంగ్రెస్ స్థానం కోసం పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి రిక్ టేలర్ ఈ బిల్‌బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే తనకు నల్లజాతి వారంటే తన మనసులో ఎలాంటి ద్వేషభావం లేదని టేలర్ అంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న అమెరికాకంటే పాతకాలం నాటి అమెరికాయే ఎంతో గొప్పగా ఉండిందని చెప్పడమే తన ఉద్దేశమని ఆయన అంటున్నారు. ఏది ఏమయినప్పటికీ టెనె్నస్సీలోని బెంటన్ వద్ద ఉన్న ఈ బిల్‌బోర్డులను స్థానికుల నిరసనలతో గత గురువారం తొలగించారు. అయితే నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల దాకా వీటిని అక్కడ పెట్టడానికి తాను డబ్బులు చెల్లించానని, అందువల్ల వాటిని తిరిగి ఏర్పాటు చేయాలని టేలర్ అంటున్నారు. మీకు ప్రాణభయం లేదా అని అడిగితే తాను అలాంటి వాటికి భయపడనని అంటూ, ఇప్పటికే తనను చంపేస్తామంటూ ఫోన్‌కాల్స్ వచ్చాయని కూడా అన్నారు. అంతేకాదు తనకే శక్తి ఉంటే జిల్లా అంతటా ఇలాంటి బిల్‌బోర్డులు వందల సంఖ్యలో ఏర్పాటు చేసి ఉండేవాడనని కూడా ఆయన అంటున్నారు.

చైనాలో తగులబడ్డ బస్సు

35 మంది సజీవ దహనం

బీజింగ్, జూన్ 26: చైనాలో ఆదివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో బస్సు పూర్తిగా తగులబడటంతో 35 మంది సజీవ దహనమయ్యారు. అందులో ఇద్దరు చిన్నారులున్నారు. మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు. హునన్ ప్రోవిన్స్‌లో 56 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు హైవేలో గార్డ్‌రైల్స్‌ను ఢీకొనడంతో డీజిల్ ట్యాంకు పగిలి మంటలంటుకోవడంతో పూర్తిగా తగులబడిపోయిందని పోలీసులు తెలిపారు. గ్యాస్‌లీక్ కారణం గానే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయ. ప్రమాదానికి సంబంధించి బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద కారణాలను నిర్ధారించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు చేపడతామని తెలిపాయ.