జాతీయ వార్తలు

ఈ ఏడాదిలో మళ్లీ ఎన్‌ఎస్‌జి భేటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయని దేశాలకు సభ్యత్వం కల్పించే ప్రక్రియపై ప్రత్యేకంగా చర్చించడానికి అణు సరఫరాదారుల గ్రూప్ (ఎన్‌ఎస్‌జి) ఈ ఏడాది చివరిలోపు మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. దీంతో 48 దేశాలతో కూడిన ఈ గ్రూపులో తనకు సభ్యత్వం కల్పించాలని భారత్ మరోసారి కోరే అవకాశం లభిస్తుంది. ఎన్‌ఎస్‌జి సభ్యత్వాన్ని పొందడానికి ఇటీవల భారత్ తీవ్రంగా ప్రయత్నించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ముగిసిన ఎన్‌ఎస్‌జి ప్లీనరీ సమావేశాల్లో ఈ గ్రూపు సభ్యత్వాన్ని పొందటంలో భారత్ విఫలమయింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో శుక్రవారం ముగిసిన ఈ సమావేశాలలో చైనా, మరికొన్ని దేశాలు అడ్డుపడటం వల్ల సభ్యత్వం కోసం భారత్ పెట్టుకున్న దరఖాస్తుకు ఆమోదం లభించలేదు. ఎన్‌పిటిపై సంతకం చేయలేదనే కారణంతో భారత్ పెట్టుకున్న దరఖాస్తును ఎన్‌ఎస్‌జి ఆమోదించలేదు. అయితే భారత్ వంటి ఎన్‌పిటిపై సంతకం చేయని దేశాలకు ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కల్పించే అంశంపై చర్చించడానికి మరోసారి భేటీ కావాలని మెక్సికో చేసిన సూచన మేరకు ఈ ఏడాదిలోపు మళ్లీ ఎన్‌ఎస్‌జి సమావేశం కానున్నట్లు భారత దౌత్యవర్గాలు ఆదివారం ఇక్కడ చెప్పాయి. మామూలుగా అయితే ఎన్‌ఎస్‌జి తరువాతి సమావేశం వచ్చే సంవత్సరంలో ఏదో ఒక నెలలో జరగవలసి ఉంది. మెక్సికో సూచనను కూడా చైనా వ్యతిరేకించిందని, అయితే అమెరికాసహా పెద్దసంఖ్యలో సభ్య దేశాలు ఆ సూచనకు మద్దతిచ్చాయని ఆ వర్గాలు తెలిపాయి.
అయితే భారత్‌కు సభ్యత్వం కల్పించే అంశంపై అనధికార సంప్రదింపులు జరపడానికి ఎన్‌ఎస్‌జి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అర్జెంటీనా రాయబారి రాఫెల్ గ్రోసి ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. అయితే సియోల్ సమావేశాలు భారత్ సభ్యత్వాన్ని అంగీకరించే అంశంలో ఒక ముందడుగుతోనే ముగిశాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనాయంత్రాంగంలోని ఒక సీనియర్ అధికారి వాషింగ్టన్‌లో పిటిఐ వార్తాసంస్థతో అన్నారు. రాఫెల్ గ్రోసి నేతృత్వంలో అనధికార సంప్రదింపులు జరపడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం, ఈ ఏడాది చివరిలోగా ఎన్‌ఎస్‌జి మరోసారి భేటీ కానుండటం భారత్ సాధించిన ముందడుగుగా భావిస్తున్నారు.

పంజాబ్ ఇంచార్జిగా
భూకబ్జా నిందితురాలు
కాంగ్రెస్ అధిష్ఠానానికి మళ్లీ తిప్పలు
న్యూఢిల్లీ, జూన్ 26: పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి పదవి ఆ పార్టీ అధిష్ఠానానికి తల బొప్పి కట్టిస్తోంది. పంజాబ్‌కు మొదట, సీనియర్ నేత కమల్‌నాథ్‌ను ఇంచార్జిగా నియమించారు. అయితే సిక్కు అల్లర్ల కేసులో కమల్‌నాథ్‌పై విమర్శలు రావటంతో ఆయన పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఇప్పుడు తాజాగా పార్టీ కార్యదర్శి ఆశాకుమారిని పంజాబ్ వ్యవహారాల ఇంచార్జిగా నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే హిమాచల్ డల్‌హౌస్ నుంచి పార్టీ ఎమ్మెల్యే అయిన ఆశాకుమారికి భూకబ్జా ఆరోపణలలో చంబా న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. రూ.8వేల జరిమానా కూడా విధించింది. ప్రస్తుతం ఆమె బెయిలుపై బయట తిరుగుతున్నారు. దీంతో ఆమె నియామకం రాజకీయంగా కాంగ్రెస్ ప్రత్యర్థుల విమర్శలకు కారణమైంది.

బిజెపీ, శిరోమణి అకాలీదళ్, ఆప్ లు ఆశాకుమారీ నియామకంపై తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

పెండింగ్‌లో 2.20 కోట్ల కేసులు

ఎప్పుడు విచారణకు వస్తాయో తెలియని కేసులు 31 లక్షలు

న్యూఢిల్లీ, జూన్ 26: దేశ వ్యాప్తంగా వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 2.20కోట్లను మించిపోయినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో 14 శాతం కేసులు ఎప్పుడు విచారణకు వస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అంటే దాదాపు 31లక్షల కేసులు ఎప్పుడు విచారణకు వస్తాయో కూడా తెలియదు. నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్ సమాచారం మేరకు ఈ ఏడాది జూన్ 24 నాటికి వివిధ కోర్టులలో 2కోట్ల 20లక్షల 75వేల 329 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎప్పుడు విచారణకు వస్తాయో కూడా తెలియని కేసుల్లో 21లక్షల 75వేల 750 క్రిమినల్ కేసులు కాగా, 9లక్షల 69వేల 309 సివిల్ కేసులు ఉన్నాయి. ఈ కేసుల సంఖ్యను తగ్గించేందుకు సుప్రీం కోర్టు ఈ-కమిటీ ఇప్పటికే అనేక రకాలు చర్యలు చేపట్టింది. పెండింగ్‌లో ఉన్న 2కోట్ల 20లక్షల కేసుల్లో పది శాతం పదేళ్లుగా విచారణకు నోచుకోని కేసులుండటం విశేషం.