జాతీయ వార్తలు

సిద్ధరామయ్యకు బహిరంగంగా ముద్దుపెట్టిన మహిళ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 26: ముద్దంటే ఎవరికి చేదు...? అయితే బహిరంగంగా అందరూ చూస్తుండగా ముద్దు పెట్టుకుంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ముఖ్యమంత్రి లాంటి ప్రజా జీవితంలో ఉన్న వాళ్లయితే మరీ చెప్పాల్సిన పని లేదు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరాయమ్యకు పాపం ఇలాంటి అనుభవమే ఎదురయింది. ఆదివారం నగరంలో జరిగిన ఓ బహిరంగ సభలో ఓ మహిళ ఆయన బుగ్గమీద ముద్దు పెట్టుకుంది. కొత్తగా ఎన్నికయిన కురుబ కులానికి చెందిన జిల్లా పంచాయత్, తాలూకా పంచాయత్ సభ్యులను సన్మానించడానికి కర్నాటక రాష్ట్ర కురుబ సంఘం ఆదివారం నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యమ్రానికి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. సిద్ధరామయ్య కూడా కురుబ కులానికి చెందినవారే. సన్మానం అనంతరం గ్రూపు ఫోటోకోసం వేదికపై ముఖ్యమంత్రి పక్కన నిలుచుని ఉండిన చిక్‌మగళూర్ జిల్లా అమృతపురకు చెందిన తరికెరె తాలూకా పంచాయత్ సభ్యురాలు గిరిజా శ్రీనివాస్ ఆనందం పట్టలేక ఒక్కసారిగా ముఖ్యమంత్రి కుడిబుగ్గపై ముద్దు పెట్టింది. ఆ షాక్‌నుంచి ముఖ్యమంత్రి తేరుకునే లోగానే ఆమె వేదిక దిగి వెళ్లిపోయింది. పాపం చేసేది లేక ఆయన నవ్వుకుంటూ తన బుగ్గను తుడిచేసున్నారు. ఆ తర్వాత గిరిజా శ్రీనివాస్ ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ సిద్ధరామయ్య తనకు తండ్రిలాంటి వారని, ఆయన పక్కన మొదటిసారిగా నిలబడిన సంతోషం పట్టలేక ముద్దు పెట్టుకున్నానని చెప్పింది. తానుకూడా సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న మైసూరు జిల్లాలోని వరుణ నియోజకవర్గానికి చెందిన దానినేనని, చిక్ మగళూరు జిల్లాకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని ఆమె చెప్పింది. ఆ తర్వాత సిద్ధ రామయ్య విలేఖరులతో మాట్లాడుతూ ఆ అమ్మాయి తన కూతురులాంటిదని అన్నారు.