జాతీయ వార్తలు

విషం చిమ్మిన చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 28: ‘కొందరు భారతీయులు స్వార్థపరులు. స్వలాభం కోసమే తప్ప మరేమీ అక్కరలేదు. భారత జాతీయులు తామెలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. ప్రపంచంలో సూపర్ పవర్‌గా ఎదగాలని కోరుకోవటం కాదు, సూపర్ పవర్ దేశాలు ఏ విధంగా ఆటలాడతాయో తెలుసుకోవాలి’ చైనా మీడియా భారతదేశంపై తాజాగా ఘాటుగా చేసిన విమర్శలివి. అణు ఇంధన సరఫరా దేశాల బృందం (ఎన్‌ఎస్‌జి)లో భారత ప్రవేశాన్ని చైనా అడ్డుకోవటం నైతికంగా సరైనదేనని కుండబద్దలు కొట్టింది. గ్లోబల్‌టైమ్స్ పత్రిక మంగళవారం ఈ అంశంపై భారత్‌ను విమర్శిస్తూ ఘాటైన సంపాదకీయం రాసింది. ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వంపై భారత్ డిమాండ్‌ను ఈ పత్రిక నిర్ద్వంద్వంగా తప్పు పట్టింది. అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి పాశ్చాత్య ప్రపంచం భారత్‌ను చెడగొట్టిందని వ్యాఖ్యానించింది. ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వానికి సంబంధించి చైనా మాత్రమే వ్యతిరేకించిందనటం సరికాదని, 48దేశాల అణు వ్యాపార వ్యవస్థలో 10 దేశాలు భారత ప్రవేశానికి అభ్యంతరం చెప్తున్నాయని స్పష్టం చేసింది. అణు నిరోధ ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయని దేశం భారత్ అని.. అలాంటి దేశానికి ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం ఎలా ఇస్తారని గ్లోబల్‌టైమ్స్ పత్రిక ప్రశ్నించింది. ‘ఎన్‌పిటిపై సంతకం చేయని భారత్ ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కోసం చురుగ్గా ప్రయత్నిస్తోంది. సియోల్ సమావేశానికి ముందైతే భారత మీడియా తమ దేశానికి ఎన్‌ఎస్‌జిలో అవకాశాలపై విస్తృతంగా చర్చించాయి. కొన్ని మీడియా సంస్థలైతే మొత్తం 48 ఎన్‌ఎస్‌జి సభ్యదేశాల్లో చైనా తప్ప 47 దేశాలూ భారత్‌కు అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం చేశాయి. ఎన్‌పిటిపై సంతకం చేయకుండానే ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కోరుకోవటాన్ని చైనా, ఇతర దేశాలు అడ్డుకోవటం రక్షణ సూత్రాల ప్రకారం సరైన చర్యే’ అని వ్యాఖ్యానించింది. చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రచురణల్లో గ్లోబల్ టైమ్స్ ప్రముఖమైంది.
అంతర్జాతీయ వ్యవహారాలపై భారత్ వ్యవహరిస్తున్న తీరును గ్లోబల్‌టైమ్స్ తీవ్రస్థాయిలో అభిశంసించింది. ‘ఇటీవలి సంవత్సరాలలో పాశ్చాత్య ప్రపంచం భారత్‌కు విపరీతంగా ప్రోత్సాహ సంకేతాలు (్థంబ్స్ అప్) ఇస్తున్నాయి. చైనాకు మాత్రం వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. వీటి మాయలో పడి భారత్ చెడిపోయింది. భారత స్థూల జాతీయోత్పత్తి రేటు చైనాతో పోల్చుకుంటే కేవలం 20శాతమే ఉందన్న విషయాన్ని గమనించాలి. అయినా పాశ్చాత్య దేశాల దృష్టిలో భారత్ ఇంకా ‘బంగారు బాలుడే’ చైనాతో పోటీ పడగల సత్తా భారత్‌కు ఉందనే ఆ దేశాలు భావిస్తున్నాయి’ అని గ్లోబల్‌టైమ్స్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారత్‌ను అమెరికా సమర్థించటాన్ని, ప్రో త్సహించటాన్ని తనదైన రీతిలో వ్యాఖ్యానించింది. చైనాకు వ్యతిరేకంగా ఉన్న తన విధానం కోసమే భారత్‌ను అమెరికా సమర్థిస్తోందని పేర్కొంది. భారత మీడియాను, భారతీయులను తప్పుపట్టిన ఈ చైనా పత్రిక భారత ప్రభుత్వం మాత్రం మర్యాదగా వ్యవహరించిందంటూ కొసమెరుపుగా కితాబు ఇచ్చింది.