జాతీయ వార్తలు

మీకో సమగ్ర విధానమే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. పాకిస్తాన్ పట్ల అనుసరించాల్సిన సమగ్ర విధానమేదీ మోదీ ప్రభుత్వానికి లేదని వారు ధ్వజమెత్తారు. దౌత్య వ్యవహారాలు, అలాగే విదేశాంగ విధానానికి సంబంధించి మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోతున్నారని విపక్షం ఆరోపించింది. సమగ్రమైన విదేశాంగ విధానం కరవైనందునే స్పష్టత, నిలకడలేకుండా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్, సిపిఎం విమర్శించాయి. పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని మోదీ మంగళవారం ప్రకటించిన తరవాత ప్రతిపక్షాలు స్పందించాయి. ‘పాకిస్తాన్‌తో చర్చలను ఎవరూ వ్యతిరేకం కాదు. అయితే మోదీని మేం అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ప్రతిపక్షాలను అభిప్రాయాలను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదన్నదే’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ స్పష్టం చేశారు. సమస్యల్లోని తీవ్రత, దాని ప్రాధాన్యతను మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. దౌత్యపరంగా మోదీ సర్కార్‌కు ఎలాంటి స్పష్టత లేదని, అంతా తూతూమంత్రంగా నడిపేస్తున్నారని ఆమె విమర్శించారు. దాన్ని అలుసుగా తీసుకునే ఉగ్రవాద సంస్థలను పాకిస్తాన్ ప్రోత్సహిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని కారత్ పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం పొంతనలేని ప్రకటనలు చేస్తుందని ఆమె అన్నారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ బర్త్‌డేకు హాజరయ్యే మోదీకి దౌత్యపరమైన అంశాలను మాత్రం తేలిగ్గా తీసుకుంటున్నారని బృందా కారత్ ఎద్దేవా చేశారు. ఆర్‌బిఐ గవర్నర్ రఘురాం రాజన్ విషయంలో కేంద్రం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని కాంగ్రెస్ నేత పిఎల్ పూనియా ఆరోపించారు.