జాతీయ వార్తలు

ఆ నినాదం నాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైసల్మేర్, జూన్ 28: ‘బేటీ బచావో బేటీ పడావో’ నినాదం తనదేనని, కేంద్ర ప్రభుత్వం దాన్ని తస్కరించిందని రాజస్థాన్‌కు చెందిన ఓ పోలీసు అధికారిణి వెల్లడించింది. బాలికలకు విద్యను అందించే ఉద్దేశంతో గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ ‘బేటీ బచావో బేటీ పడావో’ నినాదం ఇచ్చారు. దీన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. అయితే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ చేతన్ భాటి ఆ నినాదం తనదేనని వాదిస్తున్నారు. 2012 ఆగస్టు 3న అప్పటి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాను రాసిన గీతాన్ని ఆవిష్కరించారని ఆమె చెప్పారు. 1999లో ‘బేటీ బచావో బేటీ పడావో’ పేరుతో పద్యం రాసినట్టు ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు. దాన్ని ఇప్పుడు మోదీ ప్రభుత్వం జాతీయ ప్రచారంగా వాడుకుంటోందని ఆమె తెలిపారు. గత ఏడాది జనవరి 22న బాలిక విద్యకోసం ప్రధాని మోదీ ఆ నినాదం ఇచ్చారు. ఇలా ఉండగా ఆ నినాదం ఎక్కడిదంటూ గత డిసెంబర్‌లో ఆర్‌టిఐ ద్వారా పిఎంవోను కోరానని పోలీసు అధికారిణి చెప్పారు. దీనిపై మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదని ఆమె అన్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి దీనిపై లేఖ రాశానని, ఆ నినాదం తనదే కాబట్టి గుర్తింపుఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. తనకు ప్రచారం వద్దని, గుర్తింపు ఇస్తే చాలని ఆమె అంటున్నారు.