జాతీయ వార్తలు

మత సామరస్యానికి ప్రతీకలు.. ఆ ఆలయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: ఉత్తరప్రదేశ్‌లోని దేవా షరీఫ్, రాజస్థాన్ రామ్ దేవ్రా, అసోంలోని పోవా మక్కా.. ఈ మూడింటికి ఒక దానితో మరోదానికి ఎలాంటి సంబంధం లేదు కానీ, ఈ మూడు ఆలయాలకు ఒక సామ్యం మాత్రం ఉంది. అంతగా ప్రఖ్యాతి చెందని ఈ మూడు మందిరాలు ఎన్నో వందల ఏళ్లుగా శాంతి, సహన శీలత, మతసామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తూ అన్ని మతాల వారిని సమాదరిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలోని హాజీ వారిస్ అలీ షాకు చెందిన దేవా షరీఫ్ ఆలయం లక్నోకు కేవలం గంట ప్రయా ణం దూరంలో ఉంది. ‘ఈ ప్రదేశం అంతా కూడా స్వేచ్ఛ, పరమత సహనానికి ప్రతీకగా ఉంటోంది. అలాకాని పక్షంలో జనం తమ మత విశ్వాసాలను పక్కన పెట్టి పూలు, మిఠాయిలు, మెరిసిపోయే రంగురంగుల చద్దర్లతో ఈ సూఫీ సన్యాసి ఆలయానికి ఎందుకు క్యూ కడ్తారు’ అని ‘ఈక్వేటర్ లైన్’ అనే మ్యాగజైన్ మత విశ్వాసాలకు సంబంధించిన తన తాజా సంచికలో పేర్కొంది. తన మతాన్ని వదిలిపెట్టమని సూఫీ సన్యాసి అయిన షా తన శిష్యులకు ఎప్పుడూ చెప్పలేదు. అందుకే అతని భక్తుల్లో హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కన్హయ్యలాల్ అనే అతను ఈ ఆలయానికి తొలి పునాది రాయి వేశాడు. అ తర్వాత హిందువులు, ముస్లింలు ఈ ఆలయ నిర్మాణానికి తమ వంతు సేవ అందించారు’ అని ఆ మ్యాగజైన్ పేర్కొం ది. ఇక ముస్లింలు రామ్‌షా పీర్‌గా పిలుచుకునే బాబా రామ్‌దేవ్ సమాధి అయిన రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ప్రాంతంలో ఉన్న రామ్‌దేవ్రా గురించి రాస్తూ, భిన్న మతాలకు చెందిన ప్రజలు ఒక చోట చేరే ఏకైక ఆలయం దేశంలో బహుశా ఇదొక్కటే కావచ్చని పేర్కొంది. అసోం రాజధాని గౌహతి సమీపంలోని పోవా మక్కా సూఫీ సన్యాసి పీర్ ఘియాసుద్దీన్ ఆలియా సమాధి. ఈ మసీదు శంకుస్థాపనకోసం మక్కానుంచి మట్టిని తీసుకు వచ్చారని, ఈ మసీదును సందర్శించిన యాత్రికుడికి మక్కాలోని హజ్ సందర్శించిన వ్యక్తికి లభించే అనుగ్రహంలో పావుభాగం లభిస్తుందని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. అందుకే దీనికి ‘పోవా(పావు) మక్కా’ అని పేరు వచ్చింది. హిందువులు, ముస్లింలు, బౌద్ధులు అందరు కూడా దీన్ని ఎంతో పవిత్రమైనదిగా భావించి ఇక్కడికి వస్తుంటారని ఆ మ్యాగజైన్ మరో కథనంలో పేర్కొంది. ఈ మ్యాగజైన్ తాజా సంచికలో మత సామరస్యానికి ప్రతీకలుగా నిలిచిన అజ్మీర్,హజరత్ నిజాముద్దీన్ దర్గాలు, శబరిమలలోని విగ్రహం లేని బవర్ స్వామి ఆలయంలాంటి ఎన్నో ఆలయాలకు సంబంధించిన విశేషాలున్నాయి.