జాతీయ వార్తలు

గల్ఫ్ వెళ్లేవారికి కేంద్రం అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 28: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న కార్మికులు దళారుల చేతుల్లో మోసపోకుండా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రశంసించారు. విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో మంగళవారం ‘విదేశీ ప్రవాసీ దివస్’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో మధ్య ప్రాచ్య దేశాలకు వలస వెళ్తున్న భారతీయులు, మధ్యవర్తులు, దళారుల చేతుల్లో వంచనకు గురవుతున్న నేపథ్యంలో ఈ సమస్యను అరికట్టే దిశగా చర్చించారు. తెలంగాణ నుంచి విదేశాలకు వలస వెళ్తున్న కార్మికులు, ఉద్యోగులు మోసపోకుండా తమ ప్రభుత్వం తెలంగాణ ఓవర్ సీస్ న్యూస్ పవర్ కంపెనీ ద్వారా నియామకాలు ప్రారంభించిందని నాయిని అన్నారు.అదేవిధంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విదేశాలలో పని చేసేందుకు వెళ్లే నర్సులను ప్రభుత్వమే ఎంపిక చేస్తోందని, తెలంగాణ కూడా గల్ఫ్ వెళ్లే వారిని ఎంపిక చేసేందుకు ఆసక్తిగా ఉందన్నారు. ఇందుకు తగిన అనుమతులు ఇప్పించాలని నాయిని నర్సింహారెడ్డి సుష్మాను కోరారు. మరోవైపు ఏపి మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ నూతన రాజధాని అమరావతిలో మైగ్రేషన్ రిసోర్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. గల్ఫ్ బాధితుల కోసం ఉన్న కాల్ సెంటర్‌లో తెలుగు విభాగం ఏర్పాటు చేయాలని సుష్మాస్వరాజ్‌కు విజ్ఞప్తి చేశారు.
chitram...
మంగళవారం ఢిల్లీలో జరిగిన ‘విదేశీ ప్రవాసీ దివస్’ కార్యక్రమంలో కేంద్రమంత్రి
సుషా మస్వరాజ్‌