జాతీయ వార్తలు

రాష్ట్రంలో వెయ్యి జన ఔషధ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి జన ఔషధ దుకాణాల ఏర్పాటుకు కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖతో ఎపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానమంత్రి జన ఔషధ యోజన పథకం కింద మంగళవారం కేంద్రమంత్రి అనంత్ కుమార్, ఏపీ వైద్యమంత్రి కామినేని శ్రీనివాస్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ప్రతి మండలంలో ఓ జనరిక్ దుకాణం ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఒక్కొక్క కేంద్రానికి రెండున్నర లక్షల రూపాయలు నిధులను కేంద్రం ప్రభుత్వం విడుదల చేస్తుంది. వచ్చే ఆగష్టు 15 తేదీ నుండి ఈ కేంద్రాలు రాష్టవ్య్రాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఈసందర్భంగా కేంద్రమంత్రి అనంత కుమార్ మాట్లాడుతూ ఏపీ సహా మూడు రాష్ట్రాలతో అవగాహన జప్పందం కుదుర్చుకొన్నట్లు తెలిపారు. మరోసారి విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పంద కుదుర్చుకోనున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా జనఔషధ కేంద్రలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.