జాతీయ వార్తలు

ఆ సెక్షన్ కొట్టేయండి సుప్రీంలో ‘గే’ల పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: దేశంలో స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించే భారత శిక్షాస్మృతిలోని 377 సెక్షన్ రద్దుచేయాలంటూ పలువురు సెలబ్రిటీలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రముఖ చెఫ్ రీతూ దాల్మియా, అమన్‌నాథ్, డాన్సర్ ఎన్‌ఎస్ జోహార్ తదితరులు కోర్టులో పిటిషన్ వేశారు. సెక్స్‌కూడా ప్రాథమిక హక్కుల్లో అంతర్గత భాగమేమని వారు చెప్పారు. సెలబ్రిటీలు దాఖలు చేసిన పిటిషన్ బుధవారం సుప్రీం కోర్టు విచారణకు వచ్చే అకాశం ఉంది. వేసవి సెలవుల తరువాత కోర్టు బుధవారం నుంచి మొదలవుతోంది. తమ వ్యక్తిగత స్వేచ్ఛను హరించే నిబంధనను తొలగించాలని గేలు డిమాండ్ చేస్తున్నారు. ఇంత కుముందు ‘నాజ్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ సారధ్యంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఓపెన్ కోర్టులో విచారణకు అంగీకరించింది. ఫిబ్రవరి 2న క్యూరేటివ్ పిటిషన్‌ను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి పంపారు.