జాతీయ వార్తలు

తెల్లార్లూ తెరవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: ఇకపై దేశంలో రోజంతా హంగామానే.. ఎప్పుడు పడితే అప్పుడు సినిమాలకు వెళ్లొచ్చు.. షాంపిగ్‌లు చేయొచ్చు.. బ్యాంకింగ్ చేసేయొచ్చు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి మోడల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టానికి పచ్చజండా ఊపింది. దేశంలో సినిమా హాళ్లూ, షాపింగ్ మాల్‌లు, స్టోర్లు, బ్యాంకులు ఇతర సంస్థలు 365రోజులు 24 గంటలు నడుపుకునేందుకు అనుమతినిచ్చే చట్టానికి ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు భారీ ఉత్పాదక సంస్థలు, సర్వీసు రంగంలో ఉన్న సంస్థలకు మాత్రమే ఉన్న ఈ మినహాయింపును ఇప్పుడు రిటైల్‌రంగంలోని వివిధ సంస్థలకు ఈ చట్టం ద్వారా విస్తరించనున్నారు. దీని వల్ల 10 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు ఉండే సంస్థలు తమ సౌలభ్యం ప్రకారం తెరిచి ఉంచే సమయాన్ని, మూసి ఉంచే సమయాన్ని నిర్ణయించుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాదు తగిన భద్రతా ఏర్పాట్లు కల్పించటం ద్వారా మహిళా ఉద్యోగులను రాత్రి షిఫ్ట్‌లలో పని చేసేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. 24గంటలు తెరిచి ఉంచే సంస్థలు ఉద్యోగులకు మంచినీరు, క్యాంటీన్, ప్రాథమిక చికిత్స, మరుగుదొడ్డి, శిశు సంరక్షక విభాగం వంటి సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుంది. దీని వల్ల రిటైల్ రంగం అభివృద్ధి చెందుతుందని కేంద్ర కార్మిక శాఖ ఆశిస్తోంది. 24గంటలూ థియేటర్లు, షాపులు, బ్యాంకుల వంటి సంస్థలు తెరిచి ఉండటం వల్ల ఎక్కువమంది ఉద్యోగులు అవసరమవుతారని, తద్వారా అదనపు ఉద్యోగాలు లభిస్తాయని కార్మికశాఖ భావిస్తోంది. ఈ చట్టాన్ని రాష్ట్రాలు వాటి అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా సవరించుకోవచ్చు. ఈ మోడల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టాన్ని యథాతథంగా కానీ, అవసరమైన మార్పులు కానీ రాష్ట్రాలు చేసుకోవచ్చు. అంతేకాదు, ఐటి, బయోటెక్నాలజీ రంగాల్లో నైపుణ్య కార్మికుల రోజూ వారి పనిగంటలు(9), వారం రోజుల పనిగంటల (48)పై కూడా ఈ చట్టం మినహాయింపును ఇస్తోంది. దీని వల్ల దేశం మొత్తం మీద ఒకే రకమైన పని విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్రాలకు సౌలభ్యం లభిస్తుంది.