జాతీయ వార్తలు

మళ్లీ తగ్గిన పెట్రో ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ తగ్గాయి. పెట్రోల్‌పై 50 పైసలు, డీజిల్‌పై 46 పైసలు తగ్గించాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయి. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పదకొండేళ్ల కనిష్ఠ స్థాయికి చేరడంతో దేశీయ ఆయిల్ కంపెనీలు పెట్రో ధరలను తగ్గించాయి. నవంబర్ 16న పెట్రో ధరలను పెంచిన కంపెనీలు, అదే నెల 31వ తేదీన ధరలను తగ్గించాయి. నవంబర్ 16న పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచిన కంపెనీలు, 31వ తేదీన పెట్రోల్‌పై 58 పైసలు, డీజిల్‌పై 25 పైసలు తగ్గించాయి. మళ్లీ పదిహేను రోజుల వ్యవధిలో పెట్రో ధరలను తగ్గిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నాయి.