జాతీయ వార్తలు

ఎవరా గుమ్‌నామీ బాబా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 29: కొన్ని సంవత్సరాలుగా ‘గుమ్‌నామీ బాబా’ ఎవరన్నదానిపై ఎనలేని ఉత్కంఠ నెలకొంటూనే వస్తోంది. భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోసే ఆ గుమ్‌నామీ బాబా అన్న ప్రచారం నేపథ్యంలో వాస్తవాలను నిగ్గుతేల్చడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏకసభ్య దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 1985 వరకూ బోస్ గుమ్‌నామీ బాబాగా మారుపేరుతో జీవించారా లేదా అన్న విషయాన్ని విష్ణు సహాయ్ దర్యాప్తు కమిషన్ నిగ్గుతేలుస్తుంది. ఆరు నెలల్లో ఈ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల ప్రకారమే తామీ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామని యూపీ ప్రభుత్వఅధికారి బుధవారం వెల్లడించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇప్పటికే జారీ చేశామని తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో 1985 వరకూ గుమ్‌నామీ బాబా పేరుతో ఓ సాధువు ఉండేవారని ఆయనే సుభాష్ చంద్రబోస్ అంటూ విస్తృతంగానే కథనాలు వెలువడ్డాయి. 1985లో ఈ బాబా మరణం తరువాత సుభాష్ చంద్రబోస్ బంధువు లలితాబోస్ అలాగే ఫైజాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్ విచార్ మంచ్ కోర్టును ఆశ్రయించింది. గుమ్‌నామీ బాబా ఎవరో తేల్చాలని కోరింది. అప్పట్లోనే ఆ బాబాకు సంబంధించిన కొన్ని వస్తువులను భద్రపరచాలని కూడా కోర్టు ఆదేశించింది. కాగా ఈ తాజా దర్యాప్తు కమిషన్ లక్నో కేంద్రంగా పనిచేస్తుందని, ఫైజాబాద్‌లోనూ దీనికో కార్యాలయం ఉంటుందని సీనియర్ అధికారి స్పష్టం చేశారు.