జాతీయ వార్తలు

తప్పంతా నెహ్రూదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: కాశ్మీర్ సమస్య రావణ కాష్టంలా మండటానికి కారణం భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూనే అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆరోపించారు. కాశ్మీర్ విషయంలో నెహ్రూ చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. భారత్, పాక్‌ల విభజనకు అప్పటి కాంగ్రెస్ నాయకత్వానిదే బాధ్యత అని ఆయన అన్నారు. 1948లో పాకిస్తాన్ మద్దతునిచ్చిన గిరిజన దొంగలను తరిమి కొడుతున్న సమయంలో అనూహ్యంగా కాల్పుల విరమణను నెహ్రూ ప్రకటించారని షా అన్నారు. ‘‘అకస్మాత్తుగా, ఎలాంటి కారణం లేకుండా సంధిని ప్రకటించేశారు. కారణం తెలియదు. దేశంలో ఏ నాయకుడూ ఇలాంటి చారిత్రక తప్పిదం చేయలేదు. అప్పుడు జవహర్‌లాల్‌జీ కాల్పుల విరమణ ప్రకటించి ఉండకపోతే, కాశ్మీర్ సమస్య ఉత్పన్నమయ్యేదే కాదు.’’ అని షా అన్నారు. బుధవారం నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ స్మారకోపన్యాస కార్యక్రమంలో షా మాట్లాడారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకునేందుకే నెహ్రూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ తథాగతరాయ్ స్మారకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్యామాప్రసాద్ మృతిపై ఆనుమానాలు వ్యక్తం చేశారు. 1953లో ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కాశ్మీర్ వెళ్లిన శ్యామాప్రసాద్ అక్కడే మణించిన పరిస్థితుల నేపథ్యాన్ని ఆయన ప్రశ్నించారు. ఆనాటి ఘటనలపై నెహ్రూ వైఖరిని ఆయన తప్పు పట్టారు. శ్యామా మరణంపై విచారణ కూడా జరిపించలేదని రాయ్ విమర్శించారు. ఈరోజు కోల్‌కతా భారత్‌లో అంతర్భాగంగా ఉందంటే ఆ ఖ్యాతి శ్యామాప్రసాద్ ముఖర్జీకే దక్కుతుందని రాయ్ అన్నారు.

ఢిల్లీలో బుధవారం శ్యామాప్రసాద్ ముఖర్జీ స్మారకోపన్యాసం చేస్తున్న అమిత్ షా