జాతీయ వార్తలు

జీఎస్టీ ఆమోదం ఖాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 18న ప్రారంభమై ఆగస్టు 12 వరకు జరుగుతాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధక్షతన బుధవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాల్లో వస్తుసేవల పన్ను చట్టాని (జిఎస్‌టి)కి రాజ్యసభలో కచ్చితంగా ఆమోదం పొందుతామని కేంద్రం ధీమా వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తమ సంఖ్యను 74కు పెంచుకున్న అధికారపక్షం జిఎస్‌టి బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించవచ్చనే భావిస్తోంది. ఈ బిల్లుకు జేడియు నేత నితిశ్ కుమార్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీలు మద్దతు పలకడంతో జిఎస్‌టిని యథాతథంగా ఆమోదించటాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ దాదాపు ఒంటరిదయింది. ఈ పరిణామ క్రమంలో జిఎస్‌టి ఈ సమావేశాల్లోనే గట్టెక్కుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ఎం.వెంకయ్యనాయుడు విలేఖరులకు చెప్పారు. ఇప్పటికే ఈ బిల్లుకు అన్నివైపుల నుంచి మద్దతు లభించిందని, అయినప్పటికీ దీనిపై మరోసారి అన్ని పార్టీలతో సంప్రదిస్తామన్నారు. బిల్లుపై ఓటింగ్ అనేది చివరి ప్రత్యామ్నాయమని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని, ఆ పార్టీ నేతలతో మాట్లాడటానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఆ అంశంపై చర్చింటానికి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సంసిద్ధంగా ఉన్నట్లు ఆయన వివరించారు. ఎన్‌ఎస్‌జిలో భారత సభ్యత్వంపై కూడా చర్చిస్తామన్నారు. లోక్‌పాల్, లోకాయుక్త సవరణ బిల్లు ఆమోదం కూడా ఈ సమావేశాల్లో పొందుతామని ఆయన వివరించారు. వీటితోపాటు పలు కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రతిపాదించనున్నారు. లోకసభలో వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ బిల్లు, బినామీ ట్రాన్సాక్షన్ సవరణ బిల్లులను ప్రతిపాదిస్తారు. లోకసభ, రాజ్యసభలో 66బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వెంకయ్యనాయుడు తెలిపారు. మెడికల్, డెంటల్ కళాశాలల్లో ఉమ్మడి పరీక్ష (నీట్)పై జారీ చేసిన ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ప్రవేశపెడతామన్నారు. అంతే కాకుండా ఎనిమీ ప్రాపర్టీ చట్టానికి సవరణలను కూడా ప్రతిపాదిస్తామని వెంకయ్య వివరించారు. వీటితో పాటు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు మొత్తం 25కొత్త బిల్లులను పార్లమెంటు ముందుకు తీసుకువస్తాయన్నారు.

బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న వెంకయ్య నాయుడు