జాతీయ వార్తలు

సల్మాన్‌కు తాజా సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై/న్యూఢిల్లీ, జూన్ 29: బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌పై మహారాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల సల్మాన్ చేసిన ‘రేప్’ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు హాజరు కావలసిందిగా ఇచ్చిన సమన్లకు సల్మాన్ హాజరు కాకుండా తన లాయర్ల ద్వారా జవాబు పంపించటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం జాతీయ మహిళా కమిషన్ విచారిస్తున్నందున రాష్ట్ర మమిళా కమిషన్ జోక్యం చేసుకోజాలదంటూ చేసిన సల్మాన్ తన జవాబులో పేర్కొన్నారు. దీనిపై మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ బిజయ రహత్కర్ మాట్లాడుతూ సల్మాన్‌కు తాజాగా మళ్లీ సమన్లు పంపినట్లు పేర్కొన్నారు. సల్మాన్ వైఖరి క్షమార్హం కాని విధంగా ఉందని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ లలితా కుమార మంగళం ఢిల్లీలో అన్నారు.