జాతీయ వార్తలు

సిఫార్సులు అంగీకరించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూన్ 29: ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏడవ వేతన సంఘం సిపార్సులు తమకు ఎంతమాత్రం అంగీకారం కాదని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమాఖ్య బుధవారం స్పష్టం చేసింది. వేతన పెంపును పెంచాలన్న తమ డిమాండ్‌ను ప్రభుత్వం గనుక అంగీకరించకపోతే డిమాండ్ల సాధనకోసం చేపట్టదలచిన నిరవధిక సమ్మెను వారం రోజుల ముందే చేపడతామని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి ఏడవ వేతన సంఘం చేసిన సిఫార్సులకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ఇప్పుడున్న బేసిక్ వేతనంపై కనిష్టస్థాయిలో 14.27 శాతం, గరిష్ఠంగా 23.55 శాతం మేరకు పెరుగుతాయి. దీనివల్ల దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే గత 70 ఏళ్లలో ఉద్యోగుల వేతనాలను ఇంత తక్కువగా ఎప్పుడూ పెంచలేదని, ప్రభుత్వం ఈ సిఫార్సులకు మించి వేతనాలను పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్లకు ప్రభుత్వం గనుక అంగీకరించకపోతే జూలై 11నుంచి జరపాలనుకున్న నిరవధిక సమ్మెను 4వ తేదీనుంచే చేపడతామని తమిళనాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల మహాసమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎం దురైపాండ్యన్ బుధవారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు. అంతకు ముందు సమాఖ్య సభ్యులు నగరంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలున్న రాజాజీ భవన్ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు.