జాతీయ వార్తలు

వంద రోజుల్లోనే అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: అటవీ, పర్యావరణ అనుమతుల్లో ఇంకెంత మాత్రం జాప్యం జరగడానికి వీల్లేదని, వంద రోజుల్లోనే వాటిని ఆమోదించాలని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవడేకర్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వంద రోజుల్లోనే పూర్తి చేసే విధంగా రాష్ట్ర విభాగాలు పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయి పర్యావరణ అధికారులతో బుధవారం నాడిక్కడ సమావేశమైన ఆయన వంద రోజుల గడువు లోగా అనుమతులు ఇవ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తే పర్యావరణ సంబంధిత అంశాల కారణంగా ప్రాజెక్టులు ఆగిపోయే అవకాశం ఉండదని చెప్పారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల గడువును 600 రోజుల నుంచి 190రోజులకు తగ్గించామని చెప్పిన జవడేకర్ దీన్ని మరింతగా కుదించి వంద రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసేలా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాలని గతంలో చెప్పిన జవడేకర్ అందులో భాగంగానే తాజా సమావేశాన్ని నిర్వహించారు.
ప్రస్తుతం ఆన్ని రకాల అనుమతుల ప్రక్రియలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నామని, జిల్లా స్థాయిలో కూడా ఇదే పద్ధతిని కొనసాగించేలా ఓ పోర్టల్‌ను కూడా ప్రారంభించామని వెల్లడించారు. ముఖ్యంగా ఇసుక, ఇతర ఖనిజాలకు సంబంధించిన అనుమతులు ఆన్‌లైన్‌లోనే మంజూరు చేస్తామన్నారు.
ఇప్పుడు వంద రోజుల గడువును నిర్ణయించడం ద్వారా అందుకు వీలుగా సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులను సమాయత్తం చేస్తున్నామని జవడేకర్ వెల్లడించారు. అలాగే ప్రాధాన్యత, నాణ్యత, అర్హతల ప్రాతిపదికనే అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. అవసరమైతే కొన్ని కఠిన నిబంధనలను అమలు చేసేందుకూ అవకాశం ఉన్నప్పటికీ మొత్తం అనుమతుల ప్రక్రియ వంద రోజుల్లోనే పూర్తయ్యేలా చూసుకోవాలన్నారు. గత రెండు సంవత్సరాల కాలంలో 15వేలకు పైగా అటవీ, పర్యావరణ అనుమతుల్ని రాష్ట్ర స్థాయి సంస్థలు మంజూరు చేశాయని ఈ సందర్భంగా కేంద్ర పర్యావరణ మంత్రి జవడేకర్ వెల్లడించారు.