జాతీయ వార్తలు

ఢిల్లీలో సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్ గుప్తా కార్యాలయంలో సోమవారం సిబిఐ జరిపిన దాడులు కలకలం సృష్టించాయి. కుమార్ గుప్తాకు సంబంధించిన 14 ప్రాంతాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ సచివాలయంలోని మూడో అంతస్తులో సిబిఐ దాడులు నిర్వహించినట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్వయంగా తన ట్విట్టర్‌లో వెల్లడించారు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంపై సిబిఐ దాడులు జరిపిందన్న వార్తలను సంస్థ ప్రతినిధి ఖండించారు. సిఎం ఆఫీసులో సోదాలు నిర్వహించలేదని దీనిపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని సిబిఐ వివరణ ఇచ్చింది. రాజేంద్రకుమార్ గుప్తాపై అవినీతి ఆరోపణలు వచ్చాయని, అందుకే ఆయన కార్యాలయంలో సోదాలు జరిపినట్టు సిబిఐ ప్రతినిధి చెప్పారు. అవినీతి ఫిర్యాదులకు సంబంధించిన కేజ్రీవాల్ ముఖ్యకార్యదర్శిగా గతంలోనే నోటీసులు జారీ చేసినా స్పందన రాకపోవడంతోనే సోదాలు జరిపామని అన్నారు. సిబిఐ ప్రకటనను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తోసిపుచ్చారు. తన అనుమతి లేకుండా కార్యాలయంలో సిబిఐ తనిఖీలు నిర్వహించడం దారుణమని ట్విట్టర్‌లో విమర్శించారు. ముఖ్యకార్యదర్శిపై ఫిర్యాదులు సాకుగా చూపించి సిబిఐ దాడులు చేయడం దుర్మార్గపుచర్యగా కేజ్రీవాల్ అభివర్ణించారు. ప్రధానికి ఏ దస్త్రం కావాలో చెబితే ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. ఇలా ఉండగా ఢిల్లీ సిఎం ఆఫీసుపై సిబిఐ దాడుల వార్తలు రాజధానిలో దావానంలా వ్యాపించాయి.
ఈ అంశం పార్లమెంటును కుదిపేసింది. కేంద్రం సిబిఐను ఓ పావుగా వాడుకుంటోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. రాజేంద్ర కుమార్ గుప్తాకు చెందిన 14 ప్రాంతాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో సోదాలు జరిపినట్టు సిబిఐ వెల్లడించింది. సోదాల్లో 16 లక్షల నగదు గుర్తించారు. కుమార్ నివాసంలో మూడు లక్షల విదేశీ నగదు లభించిందని సిబిఐ తెలిపింది. తన అధికారాన్ని ఉపయోగించుకుని అనుకూలమైన వ్యక్తులకు టెంటర్లు ఖరారు చేయించారని కుమార్ గుప్తాపై సిబిఐకు ఫిర్యాదులు అందాయి. కాగా తన ఈ మెయిల్స్ అకౌంట్లను తెరవడానికి గుప్తా సహకరించడం లేదని సిబిఐ తెలిపింది.

చిత్రం... ఢిల్లీ సచివాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు