జాతీయ వార్తలు

కోటి మందికి పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి ఆర్‌సి ప్రకారం కేంద్ర ఉద్యోగులకు కొత్త వేతనాలు
వేతనాల అమలు : జనవరి 1, 2016
మొత్తం పెంపు : 23.55%
మొత్తం పెరుగుదలలో మూలవేతనం : 16%
అలవెన్సులు : 63%
పింఛన్లు : 24%
వార్షిక ఇంక్రిమెంట్ : 3%
కనీస వేతనం: రూ.18వేలు
గరిష్ట వేతనం (కాబినెట్ కార్యదర్శి): రూ.2.50లక్షలు
ఖజానాపై భారం : రూ.1,02,100 కోట్లు

న్యూఢిల్లీ, జూన్ 29: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం బంపర్ బొనాంజాను అందించింది. కరవుతో అల్లాడుతున్న ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ఒక్కసారిగా వచ్చి కుండపోత కురిసినట్లు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 58లక్షల మంది పింఛనుదారులకు ఏడోవేతన సంఘం సిఫార్సుల వర్షం పండగ తెచ్చిపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఏడోవేతన సంఘం సిఫార్సులకు ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ఉద్యోగుల వేతనాలు అలవెన్సులతో కలిపి 23.5శాతం పెరగనున్నాయి. అదే సమయంలో పింఛనుదారుల పింఛన్లు 24శాతం పెరగబోతున్నాయి. ‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అభినందనలు. ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు ద్వారా వేతనాల్లో చరిత్రాత్మక పెంపు జరిగింది’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ కేబినెట్ సమావేశం అనంతరం ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ఉద్యోగుల వేతనాలు కిందిస్థాయి ఉద్యోగుల కనీస వేతనం రూ.7వేల నుంచి రూ.18వేలు కానుంది. అత్యధికంగా కేబినెట్ కార్యదర్శి వేతనాన్ని ఇప్పుడున్న రూ.90 వేల నుంచి రూ.2.50లక్షలకు ఫిక్స్ అవుతుంది. దీని వల్ల ఖజానాపై దాదాపు 1.02లక్షల కోట్ల రూపాయల భారం పడుతోంది. స్థూల జాతీయోత్పత్తిలో ఇది 0.7శాతం ఉంటుంది. ఈ పెంపు వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ పెంపు ప్రభావం సానుకూలంగా పడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. వేతనాల పెంపు వల్ల గృహనిర్మాణ రంగం బాగా పుంజుకుంటుందని, ఇతరత్రా కొనుగోలు శక్తి గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏడో వేతన సంఘం సిఫార్సులపై అధ్యయనం కోసం గత జనవరిలో కేబినెట్ కార్యదర్శి పి.కె.సిన్హా అధ్యక్షతన ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ తన సూచనలను కేంద్రానికి ఇటీవలే సమర్పించింది. జూనియర్ స్థాయిలో ఉద్యోగుల మూల వేతనాన్ని 14.27 పెంచాలని పిఆర్‌సీ సిఫార్సు చేసింది. సిన్హా కమిటీ మాత్రం కనీస వేతనాన్ని 23,500గా, గరిష్ట వేతనాన్ని 3.25లక్షలు చేయాలని సిఫార్సు చేసింది.