జాతీయ వార్తలు

షీనాపై కూర్చుని గొంతు నులిమింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జులై 1: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. 2012 ఏప్రిల్ 24వ తేదీన తాము కారులో వెళ్తున్నప్పుడు షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జియా తన కుమార్తెపై కూర్చుని ఆమె గొంతు నులిమిందని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ శ్యామవర్ రాయ్ ఆరోపించాడు. ఆ సమయంలో తాను షీనా నోరు మూయగా, ఇంద్రాణీ మాజీ భర్త సంజీవ్ ఖన్నా ఆమెను గట్టిగా పట్టుకున్నాడని రాయ్ 12 పేజీల వాంగ్మూలంలో వెల్లడించాడు. ఇంద్రాణీ ఆదేశాల మేరకే తాము ఈ హత్యకు సహకరించామని రాయ్ చెప్పాడు. హిందీలో ఉన్న ఈ వాంగ్మూల ప్రతులను సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం ఇంద్రాణీ భర్త పీటర్ ముఖర్జియా సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందరికీ అందజేసింది. ఈ కేసులో దర్యాప్తు అధికారులు గత ఏడాది ఆగస్టులో శ్యామవర్ రాయ్‌ని అరెస్టు చేసి అతని వద్ద ఒక పిస్తోలును కనుగొన్న విషయం తెలిసిందే. అయితే ఇంద్రాణీ ఆదేశాల మేరకే పార్సిల్ ద్వారా తనకు ఈ పిస్తోలును అందజేశారని, అంతేకాకుండా మూడు నెలల సెవెరెన్స్ పేని (కాంట్రాక్టును లేదా సెలవును ముందుగానే రద్దు చేసినప్పుడు ఉద్యోగికి చెల్లించే మొత్తాన్ని) తీసుకోవాల్సిందిగా ఇంద్రాణీ సహాయకుడు కాజల్ శర్మ తనకు తెలియజేశాడని రాయ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ‘కారులో ఇంద్రాణీ తన కుమార్తెపై కూర్చుని ఆమె గొంతు నులిమింది. ఆ సమయంలో షీనా నా వేలును కొరకడంతో రక్తస్రావమైంది’ అని రాయ్ వెల్లడించాడు. షీనా హత్య తర్వాత ఇంద్రాణీ, సంజీవ్ ఖన్నా ఇంగ్లీషులో మాట్లాడుకున్నారని, అది ఏమిటో తనకు అర్ధం కాలేదని, అయితే వారి మాటల్లో మిఖాయిల్ (ఇంద్రాణీ కుమారుడు), రాహుల్ (పీటర్ కుమారుడు) ప్రస్తావన వచ్చిందని శ్యామవర రాయ్ తెలిపాడు.
ఫ్లాట్ యజమానులకు
ఐదు కోట్ల పరిహారం చెల్లించండి
యూనిటెక్‌కు సుప్రీం ఆదేశం
ఆగస్టు 12నాటికి ఇవ్వకపోతే జైలే
న్యూఢిల్లీ, జూలై 1: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ యూనిటెక్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. నొయిడాలో కొనుగోలుదారులకు తాత్కాలిక పరిహారం కింద ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. ఆగస్టు 12నాటికి చెల్లింపులు జరగాలని యూనిటెక్‌ను సూచించింది. తమ ఆదేశాల ప్రకారం పరిహారం చెల్లించని పక్షంలో కంపెనీ డైరెక్టర్లు జైలుకు వెళ్లాల్సి వస్తుందని కోర్టు తీవ్రంగా హెచ్చరించింది. నొయిడా సెక్టర్ 76లో వెంచర్‌కు సంబంధించి ఫ్లాట్లు కొనుక్కొన్న వాళ్లకు కంపెనీ స్వాధీనం చేయలేదు. దీనిపై బాధితులు జాతీయ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కొనుగోలుదారులకు పరిహారం అందించాలని యూనిటెక్‌ను కమిషన్ ఆదేశించింది. దీన్ని కంపెనీ పట్టించుకోకపోవడంతో బాధితులంతా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం యూనిటెక్ షేర్ ధర 1.5 శాతం పడిపోయింది.
రాబర్ట్ వాద్రా
కంపెనీకి ఇడి నోటీసు
న్యూఢిల్లీ, జూలై 1: బికనీర్‌లో భూమి కొనుగోలుకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైన్ హాస్పిటాలిటీ సంస్థకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరో నోటీసు జారీచేసింది. ఈ సంస్థకు సంబంధించి సమర్పించిన ఆర్థిక పత్రాలు సరిగా లేకపోవడంతో మరోసారి నోటీసు జారీచేసినట్లు ఇడి వర్గాలు వెల్లడించాయి. స్కైలైన్ సంస్థకు చెందిన న్యాయవాది సమర్పించిన పత్రాలు సక్రమంగా లేకపోవడం, కంపెనీ ప్రతినిధి నుంచి అధికారిక లేఖను సమర్పించడంలో విఫలం కావడంతో రెండోసారి నోటీసును జారీచేశారు. స్కైలైన్ సంస్థకు చెందిన ఆర్థిక పత్రాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని ఇడి రెండు వారాల గడువు ఇచ్చిన విషయం విదితమే. అయితే వారం క్రితం ఇడి అధికారుల ముందు హాజరైన న్యాయవాది సంబంధిత పత్రాలు సమర్పించకపోవడంతో ఇడి తీవ్రంగా స్పందించింది. ఇదే క్రమంలో ఈ కంపెనీకి మరికొంతమంది ప్రముఖులకు త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.