అంతర్జాతీయం

పాకిస్తాన్ జైళ్లలో 518 మంది భారతీయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ, జులై 1: మన దేశానికి చెందిన 463 మంది మత్స్యకారులు సహా మొత్తం 518 మంది ఖైదీలు పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నారు. వీరి జాబితాను పాకిస్తాన్ శుక్రవారం భారత్‌కు అందజేయగా, మన జైళ్లలో ఉన్న పాక్ ఖైదీల జాబితాను భారత అధికారులు దాయాది దేశానికి అందజేశారు. దౌత్య వ్యవహారాలకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా ఇరు దేశాలు ఈ జాబితాలను ఇచ్చి పుచ్చుకున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) ఒక ప్రకటనలో వెల్లడించింది. పాకిస్తాన్ జైళ్లలో ఉన్న 518 మంది భారత ఖైదీల జాబితాను నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లో భారత హైకమిషన్‌కు అందజేసిందని, వీరిలో 463 మంది మత్స్యకారులు, మరో 55 మంది ఇతర ఖైదీలు ఉన్నారని పాక్ విదేశాంగ శాఖ కార్యాలయం పేర్కొం ది. ఇందుకు సంబంధించి 2008 మే 21వ తేదీన ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.